Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నడిరోడ్డుపై లేడీ కమెడియన్.. అల్లు అర్జున్ ఆర్థిక సాయం ఏమైంది

నడిరోడ్డుపై లేడీ కమెడియన్.. అల్లు అర్జున్ ఆర్థిక సాయం ఏమైంది

Chitrajyothy 1 week ago

ఇండస్ట్రీలో ఉన్నవారి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. అందుకే బాగా సంపాదించేటప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అని చెప్తూ ఉంటారు.

డబ్బు ఉన్నప్పుడు, అవకాశాలు వచ్చేటప్పుడు అంతా బానే ఉంటుంది. ఒక వయస్సు వచ్చాకా అనారోగ్యం పాలయ్యాక.. చేతిలో డబ్బు లేక, అవకాశాలు రాక చాలామంది నటీనటులు దీనస్థితిలో మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా లేడీ కమెడియన్ పావలా శ్యామల ( Pavala Syamala) అలాంటి దీనస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది.

నటిగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి.. ఎంతోమందిని తన కామెడీతో నవ్వించిన ఆమె చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను అనుభవిస్తోంది. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక నరకయాతన చూస్తోంది. గుండె సమస్యలతో బాధపడుతున్న పావలా శ్యామల ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్ లో ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి పెద్దలు సాయం చేయాలనీ ఆమె ఎంతోమందిని కోరింది. ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్న సాయి ధరమ్ తేజ్, పూరి ఆకాష్ ఇలా తదితరులు తమకు తోచిన సాయం చేశారు.

తాజాగా పావలా శ్యామల మళ్ళీ నడిరోడ్డున పడింది. చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా డబ్బు లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తిరిగి పావలా శ్యామలను క్యాబ్ లో వెనక్కి పంపించేశారు. అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ ఆమెను ఒక జంక్షన్ వద్ద దింపి వెళ్లిపోయాడు. ఫుట్‌పాత్‌పై గందరగోళంగా ఉన్న శ్యామలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు పావలా శ్యామల వద్దకు వచ్చి ఆర్కే ఫౌండేషన్ కి తరలించారు.

అయితే పావలా శ్యామలకు ఈ మధ్యనే అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రతినెలా ఆమెకు పదివేలు అందేలా బన్నీ ఏర్పాటు చేసినట్లు టాక్ నడిచింది. ప్రతి నెల పదివేలు అందింతే.. పావలా శ్యామల చికిత్సకు డబ్బులు లేక ఇలా నడిరోడ్డుపై ఎందుకు ఉంది..? బన్నీ నిజంగానే డబ్బులు పంపుతున్నాడా.. ? ఆ డబ్బులు కూడా పావలా శ్యామల చికిత్సకు సరిపోవడం లేదా.. ? అసలు అల్లు అర్జున్ ఆర్థిక సాయం ఆమెకు అందుతుందా.. ? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆర్థిక సాయంపై బన్నీ టీమ్ ఏమైనా స్పందిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy