Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Naga Chaitanya: నా కెరీర్‌లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే

Naga Chaitanya: నా కెరీర్‌లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే

Chitrajyothy 0 months ago

వెండితెరపై ప్రేమకథలను అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునేలా పండించడంలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) రూటే వేరు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ, ఒక నటుడిగా తన కెరీర్‌లో అత్యంత పర్ఫెక్ట్ సింక్ కుదిరిన నటి ఎవరు అంటే..

చైతూ చెప్పిన సమాధానం ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక లేటెస్ట్ టాక్ షోలో తన ఆన్-స్క్రీన్ రొమాంటిక్ బాండింగ్‌పై ఎదురైన ప్రశ్నకు ఆయన ఏమాత్రం తటపటాయించకుండా, తన బెస్ట్ కెమిస్ట్రీ పార్ట్నర్‌గా కృతి శెట్టి (Krithi Shetty) పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో హీరోలు చాలా సేఫ్ గేమ్ ఆడుతుంటారు, కానీ చైతన్య మాత్రం ఎంతో బోల్డ్‌గా తన మనసులోని మాటను బయటపెట్టడం విశేషం.

చై- కృతి శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన బంగార్రాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, గ్రామీణ నేపథ్యంలో సాగే చిన బంగార్రాజు - సర్పంచ్ లక్ష్మి పాత్రల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. వీరి క్యూట్ టామ్ అండ్ జెర్రీ తరహా గొడవలు, రొమాంటిక్ సీన్స్ థియేటర్లలో మాస్ ఆడియన్స్‌తో ఈలలు వేయించాయి. ఆ మ్యాజిక్ కేవలం ఒక్క సినిమాకే పరిమితం కాకుండా, ఆ తర్వాత వచ్చిన కస్టడీ చిత్రంలోనూ రిపీట్ అయింది. అయితే, చైతూ చేసిన ఈ కామెంట్స్‌పై అక్కినేని ఫ్యాన్స్ నుంచి భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. సమంతతో నాగచైతన్యకు ఉన్న స్క్రీన్ మ్యాజిక్ ఎప్పటికీ క్లాసిక్ అని, ఏమాయ చేసావె నుంచి మజిలీ వరకు వారిద్దరి మధ్య కనిపించిన ఇంటెన్స్ ఎమోషన్స్ అన్‌మ్యాచ్‌బుల్ అంటూ నెటిజన్లు పాత జ్ఞాపకాలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

మరోవైపు, నాగచైతన్య తన లైనప్‌ను సరికొత్త కథలతో చాలా స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వృషకర్మ అనే మిస్టిక్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌తో ఆయన బిజీగా ఉన్నారు. విలక్షణమైన సబ్జెక్ట్‌తో రాబోతున్న ఈ క్రేజీ మూవీలో టాలెంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. దీనితో పాటుదూత 2 సిరీస్ ని ముగిస్తున్నాడు. ఇవి కాకుండా డిటెక్టివ్ కార్తీక్ ఫేమ్ దర్శకుడు క్లాక్స్ చెప్పిన సరికొత్త జోనర్ కథకు కూడా చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీల ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి, బ్యాక్-టు-బ్యాక్ డిఫరెంట్ ఎక్స్ ప్రెసివ్ జోనర్స్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి యువసామ్రాట్ పక్కా స్కెచ్‌తో దూసుకుపోతున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy