Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nandu's World: ఇన్ ఫ్లుయెన్సర్ వీసాల దందా... ఖండించిన నందు!

Nandu's World: ఇన్ ఫ్లుయెన్సర్ వీసాల దందా... ఖండించిన నందు!

Chitrajyothy 3 weeks ago

వరికైనా కాస్తంత ఫేమ్‌ వస్తే చాలు... వారి పరువు తీయడానికి కొందరు కాచుకుని ఉంటారు. ఇది ఒక వర్షన్‌. కాస్తంత పేరు, గుర్తింపు వస్తే చాలు... దాన్ని ఆధారంగా చేసుకుని అడ్డదారులు తొక్కి మరింత డబ్బు సంపాదించాలని చూస్తుంటారు.

ఇది మరో వర్షన్‌. ఇటీవల ఎంతో కష్టపడి, ఒక్కో ఇటుక పేర్చుకుని తమకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. వారు ఫలానా స్కామ్‌లో ఇరుక్కున్నారని, అమాయకులను తమ ఇమేజ్‌తో మోసం చేశారని, బాధితుల ఉసురంతా వీళ్ళు పోసుకుంటున్నారని! అయితే ఇందులో నిజానిజాల నిగ్గు తేలాలంటే నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఈ లోగా వాళ్ళకు జరగాల్సిన డామేజ్‌ జరిగిపోతుంది. నిన్న మంగ్లీ విషయంలో కావచ్చు... ఇవాళ యూ ట్యూబర్‌ కమ్ ఇన్ ఫ్లుయెన్సర్ నందూస్‌ వరల్డ్ నందన విషయంలో కావచ్చు.

నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేస్తూ తద్వారా లక్షలాది మంది అభిమానాన్ని చూరగొంది నందన. తన భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ... జనాన్ని కొన్నేళ్ళుగా ఎంటర్ టైన్ చేస్తోందామె. మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్ననని చెబుతూనే... వాటిని తోసిరాజని వీడియోస్ చేయడం మొదలు పెట్టింది. నందనలోని చొరవ, తెగింపులకు ఎంతోమంది మహిళలు ఫిదా అయ్యారు. అలాంటి నందన పేరు ఇప్పుడు ఓ వీసా స్కామ్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది.

యు.కె.కు కాస్‌ (Certificate of Sponsorship) వీసాలు ఇప్పిస్తామని కొంతమంది దగ్గర లక్షల రూపాయలను మధుకర్‌, నందన దంపతులు వసూలు చేశారని, ఆ తర్వాత ముఖం చాటేశారని కొందరు మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. యు.కె.లో దాదాపు ఆరేడు కన్సల్టెన్సీ కంపెనీలను నిర్వహిస్తూ, తమను తప్పుదోవ పట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మధుకర్ చెప్పిన అక్కౌంట్ లలో లక్షల రూపాయలను వేశామని, అయితే వారు తప్పుడు పత్రాలను చూపించి, తమను మోసం చేశారని, తీరా నిలదీస్తే తమ నంబర్లను బ్లాక్ చేసి తప్పించుకుని తిరుగుతున్నారని వారంటున్నారు.

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా నానుతున్న ఈ విషయంపై మధుకర్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు కానీ నందన మాత్రం ఓ వీడియోను విడుదల చేశారు. తమకు వచ్చిన పేరును చూసి తట్టుకోలేక కొందరు ఎదురు డబ్బులిచ్చి మరీ తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని వాపోయారు. యు.కె. అలా చేస్తున్న వారిపై తాము కేసు పెట్టామని, అక్కడ నుండి ఇండియా వచ్చిన ముగ్గురు వ్యక్తులు పనికట్టుకుని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని ఆమె కోరారు. తమకు యు.కె.లో తప్పితే ఇంకెక్కడా కంపెనీలు లేవని, తమ పేరు చెప్పి ఎవరు ఏం చేసినా నమ్మవద్దని, అలాంటి వారి అక్కౌంట్లకు రిపోర్ట్ కొట్టమని అర్థించారు. తమకు సంబంధించిన ఏ విషయమైనా తామే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తామని ఆమె చెప్పారు.

చిత్రం ఏమంటే... నందనకు ఉన్న ఇమేజ్‌, ఫాలోయింగ్ ను గుర్తించి, ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమాలో ఓ పాత్ర ఇచ్చారు. అందులో హీరోయిన్‌ నయనతార స్నేహితురాలు పాత్రలో ఒక సన్నివేశంలో నందన కనిపించారు. చేసింది ఒక్క సన్నివేశమే అయినా తద్వారా ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. ఇదే సమయంలో ఇలా వీసా స్కామ్‌లో ఆమె, భర్త ఇరుక్కోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ ఆరోపణలలో నిజానిజాలు ఏమిటనేది ఎప్పుడు తేలుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా!

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కండక్టర్' ఐడీ కార్డ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy