Dailyhunt
Nani: విజయ్ విక్టరీపై టాలీవుడ్ హీరో ఫస్ట్ రియాక్షన్!

Nani: విజయ్ విక్టరీపై టాలీవుడ్ హీరో ఫస్ట్ రియాక్షన్!

Chitrajyothy 1 week ago

మిళనాడు ఎన్నికల ఫలితాలు వాడివేడిగా సాగుతున్నాయి. నటుడు విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ (TVK Party) ముందంజలో ఉంది. విజయ్‌దే గెలుపు అని ఇప్పటికే వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

విజయ్‌ గెలుపుపై టాలీవుడ్‌ హీరో నాని (Nani) స్పందించారు అయ్యారు. విజయ్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నాని చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. 'మొదట అవమానించారు.. ఆ తర్వాత విజేతగా కిరీటం పెట్టారు. మొదట మా ఇంట జరిగింది(పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి).. ఇప్పుడు పొరిగింట జరగనుంది. తక్కువ అంచనాలతో సక్సెస్‌ అనేది సినిమాల్లో చూస్తుంటాం. అది రాజకీయాలకు కూడా అన్వయించుకోవచ్చని ఇప్పుడు తెలుస్తుంది. ఎన్నికల విషయంలో తమిళనాడు ప్రజల తీర్పు స్పష్టమైంది. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను' అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇలాంటి విషయాల్లో నాని ఎప్పుడూ ముందుంటారు. నిజాన్ని నిర్భయంగా చెబుతారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ ఓడిన సందర్భంగా సపోర్ట్‌గా మాట్లాడారు. 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో గెలిచినప్పుడు ఆయనే ముందు స్పందించి శుభాకాంక్షలు తెలిపారు. హీరో నిఖిల్‌ సిద్ధార్స్‌, విశాల్‌ కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy