Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నన్ను పీడించి డబ్బులు వసూలు చేయలేదు - నిర్మాత

నన్ను పీడించి డబ్బులు వసూలు చేయలేదు - నిర్మాత

Chitrajyothy 4 days ago

ళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి (Battula Saraswathi) సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు (Battula Koteswara Rao) నిర్మించిన చిత్రం 'పురుషః' (Purushaha).

ఈ మూవీతో పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan Battula) బత్తుల హీరోగా పరిచయమవుతోన్న ఈ సినిమాకు వీరు వులవల దర్శకుడు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించిన ఈ సినిమా మే 22న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాకు సినిమా విశేషాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

'మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఫీల్డ్‌తో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడకు వచ్చాక అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నాను. మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టడానికి కారణం ఉంది. 'గోకులంలో సీత' చూసిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప స్థాయికి వెళ్తారని అనిపించింది. ఆ వయసులో నన్ను నేను ఆయనలో చూసుకున్నాను. ఆయనకు అభిమానిగా మారిపోయాను. నాకు కొడుకు పుడితే ఆయన పేరే పెట్టుకోవాలని అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే మాకు 'తమ్ముడు' సినిమా టైమ్‌లో అబ్బాయి పుట్టాడు. అనుకున్నట్టుగానే ఆయన పేరే పెట్టుకున్నాను.

నాకు మొదటి నుంచి సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. మా అబ్బాయికి సిగ్గు, బిడియం ఎక్కువ. హీరో అవ్వాలనుకున్న నా కలని మా అబ్బాయి ద్వారా నెరవేర్చుకున్నాను. మా అబ్బాయికి ఉన్న సిగ్గు, బిడియం కూడా ఈ సినిమాల వల్ల పోతుంది. అందుకే మా అబ్బాయిని హీరోగా చేశాను. దర్శకుడు వీరుతో సినిమా కంటే ముందు మరో దర్శకుడితో సినిమా అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత సతీష్ ముత్యాల.. వీరుని పరిచయం చేశారు. కథ చెప్పారు.. నాకు బాగా నచ్చింది. 'పురుషః' కథ చాలా బాగుంటుంది. ఆయన నెరేషన్ ఇచ్చిన తీరు కూడా చాలా నచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఏదో ఒక భారీ సినిమా తీయాలనే కోరిక నాకు లేదు. మా అబ్బాయికి ఉన్న బిడియం, సిగ్గుని పోగొడితే చాలు అని నాకు అనిపించింది. డబ్బుల కోసం అయితే మూవీ తీయలేదు. ఈ సినిమాతో నేను లాభాలు కూడా ఆశించడం లేదు. వీటీవీ గణేష్ పాత్ర అందరినీ నవ్విస్తుంది. ఆయన మాకు ఎంతో సహకరించారు. వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి అందరూ చక్కగా నటించారు. మా హీరోయిన్లు అందంగా కనిపించడమే కాకుండా తెరపై చక్కగా నటించారు. అనంత శ్రీరామ్ పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. మా అబ్బాయి గురించి నేను చెప్పను. సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్ చెప్పాలి. టెక్నీకల్ టీమ్ అంతా ఎంతగానో సపోర్ట్ చేశారు.

ఈ సినిమాను మొత్తంగా మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మే 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. థియేటర్లో హాయిగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది. ఈ జర్నీ నాకు చాలా నచ్చింది. కారు డ్రైవర్లు, లైట్ మెన్స్ నుంచీ ప్రతీ ఒక్కరూ మాకు సహకరించారు. అందరూ ఓ పది రూపాయలు మిగిల్చేలానే చూశారు. అంతే కానీ నన్ను ఎక్కడా పీడించి డబ్బులు వసూలు చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రయాణం నాకెంతో సాఫీగా సాగినట్టు అనిపించింది. ఇండస్ట్రీ గురించి బయట చెప్పుకుంటున్నట్లుగా ఎక్కడా చెడు వాతావరణం నాకు కనిపించలేదు. మా అబ్బాయికి నేనో మాట ఇచ్చాను. మూడు సినిమాలు చేస్తానని. ఈలోపు మా వాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఓకే.. అలా లేదంటే మళ్లీ మన ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని ముందే చెప్పాను. అలా నేను మా వాడితో కచ్చితంగా నాకున్న స్థోమతలో మూడు సినిమాలు అయితే చేస్తాను..' అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో 'పెద్ది' ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy