Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nayantara: మనిషి మారినా దక్కని విజయం!

Nayantara: మనిషి మారినా దక్కని విజయం!

Chitrajyothy 3 weeks ago

యనతార ఈ మధ్య కొంత మారింది. తన సినిమాల ప్రమోషన్స్ కు సైతం దూరంగా ఉండే నయనతార సినిమా ప్రారంభానికి ముందో, ఆ తర్వాతనో తన సహకారం అందిస్తోంది. ఈ యేడాది సంక్రాంతికానుకగా వచ్చిన 'మన శంకర్ వరప్రసాద్‌ గారు'మూవీకి ఆమె సైన్ చేయగానే ఆ విషయాన్ని తెలియచేస్తూ ఓ వీడియోను దర్శకుడు అనిల్‌ రావిపూడితో కలిసి చేసింది.

ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా విడుదలైన ఆమె మరో సినిమా 'టాక్సిక్‌' మూవీ ప్రమోషన్స్ లో నయన్ పాల్గొంది. బెంగళూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై... తన మనసు విప్పి మాట్లాడింది. ఈ చిత్ర కథానాయకుడు యశ్‌ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఇలా నయన్ స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొని ఆ సినిమా గురించి గొప్పగా చెప్పినా... 'టాక్సిక్‌' మాత్రం బాక్సాఫీస్ బరిలో వండర్స్ క్రియేట్ చేయలేకపోయింది.

బుధవారం విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 200 కోట్ల గ్రాస్ ను వసులూ చేసింది కానీ ఈ సినిమా బ్రేకీవెన్ కావడానికి ఈ జోరు సరిపోదు. ఈ నేపథ్యంలో నయనతార తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. ఆమె ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, 'నేను ఎన్నో సినిమాల్లో నటించాను. బ్లాక్ బస్టర్స్ అవుతాయని నేను ఊహించిన చిత్రాలు పరాజయం మూటగట్టుకున్నాయి. ఆడవని అనుకున్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చిత్ర పరిశ్రమలో సంవత్సరాల తరబడి సాగిన నా అనుభవం నాకొక గొప్ప విషయాన్ని నేర్పింది. ఫలితం విజయమైనా, అపజయమైనా వినయంతో స్వీకరించడం నేర్చుకున్నాను' అని తెలిపింది.

చిత్రం ఏమంటే... ఇది కేవలం 'టాక్సిక్‌' చిత్రానికి మాత్రమే వర్తించదు. ఈ సినిమా విడుదలైన రెండో రోజులకే నయన్ హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం 'హాయ్‌' కూడా విడుదలైంది. ఈ సినిమాకూ పెద్దంత ప్రేక్షకాదరణ లభించడం లేదు. ఈ సినిమా నిర్మాణంలో నయన్ భాగస్వామిగానూ వ్యవహరించారు. సో... నయన్ కు వరసగా 'టాక్సిక్‌, హాయ్‌' రూపంలో పరాజయాలు ఎదురయ్యాయనే భావించాలి.

ఇవి కూడా చదవండి:

హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్‌ పాత్రలతో మెప్పిస్తున్న భామలు

Raviteja: 'ఇరుముడి' తర్వాత రవితేజ స్పీడ్‌.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!

కృతి సనన్‌ రాఖీ యాడ్‌ వివాదం.. మధు చోప్రా హాట్‌ కామెంట్స్‌!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy