Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!

Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!

Chitrajyothy 3 weeks ago

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలతో దూసుకుపోతున్నారు. తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన వరుస సినిమాలను అంగీకరిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK111' షూటింగ్‌లో ఆయన ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. దీనితో పాటుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'NBK112' ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య జాబితాలోకి ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమా వచ్చి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కోలీవుడ్‌లో 'మార్క్ ఆంటోని' (Mark Antony), 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) ఈ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకత్వంలో నటసింహం ఒక పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ప్రత్యేకంగా బాలయ్యను కలిసి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించారని సమాచారం. ఆ కథలోని మాస్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ నటసింహానికి విపరీతంగా నచ్చేశాయని చెబుతున్నారు. తన బాడీ లాంగ్వేజ్‌కు, అభిమానులు ఆశించే అంశాలకు ఈ కథ కచ్చితంగా సరిపోతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. లైన్ అద్భుతంగా ఉండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆధిక్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ భారీ ప్రాజెక్టును నిర్మించడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే బాలయ్యతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన మైత్రీ సంస్థ, ఇప్పుడు ఈ సినిమాను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించే ఛాన్స్ ఉంది. అన్ని సమీకరణాలు సరిగ్గా కుదిరి, ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా సెట్స్ పైకి వెళితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువ దర్శకుడి టేకింగ్, బాలయ్య ఉగ్రరూపం వెండితెరపై కలిస్తే రికార్డుల మోత మోగడం తథ్యమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy