Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు నటి పావలా శ్యామల అంత్యక్రియలు

నేడు నటి పావలా శ్యామల అంత్యక్రియలు

Chitrajyothy 3 weeks ago

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (Pavala Syamala) అంత్యక్రియలు నేడు (జూలై 29) నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుంచి ఆమె భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్ మహాప్రస్థానానికి తరలించనున్నారు.

ఉదయం 10 గంటలకు పావలా శ్యామల పార్థివ దేహం మహాప్రస్థానానికి చేరుకోనుంది. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు, అభిమానుల సందర్శనార్థం ఒక గంట పాటు అక్కడే ఉంచనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ అంత్యక్రియలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) నాయకులు, పలువురు సినీ నటులు హాజరై ఆమెకు నివాళులు అర్పించనున్నారు. పావలా శ్యామల అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను నటి కరాటే కళ్యాణి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పావలా శ్యామల చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంగళవారం తెల్లవారుజామున 1.52 నిమిషాలకు గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 1984లో చిరంజీవి 'ఛాలెంజ్' సినిమాతో తెరంగేట్రం చేసిన పావలా శ్యామల.. సుమారు 100 వరకు సినిమాల్లో నటించారు. చివరగా 2019లో వచ్చిన 'మత్తు వదలరా' చిత్రంలో కనిపించారు. 2014 నుంచి తీవ్ర ఆర్థిక, వృద్దాప్య సమస్యలతో సతమతమవుతున్న ఆమె.. తన కుమార్తెతో కలిసి దీనస్థితిలో కాలం వెళ్ళదీస్తూ వచ్చారు.

పావలా శ్యామల మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. దర్శకుల సంఘం ట్రస్ట్ తరఫున యాభై వేలు, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు తరఫున యాభైవేలు కలిపి.. మొత్తం లక్ష రూపాయలు విరాళాన్ని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

Naga Chaitanya: ప్రేమకథలు తగ్గిపోయాయని బాధపడ్డా..

నచ్చిన అమ్మాయిలకు బీట్ వేయండి.. ఫ్యాన్స్ కి బన్నీ సలహా

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సామజవరగమనా హీరోయిన్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy