Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిన్న 'చైనా పీస్'... నేడు 'చిరంజీవి'! టైటిల్స్‌పై సెన్సార్ అభ్యంతరం

నిన్న 'చైనా పీస్'... నేడు 'చిరంజీవి'! టైటిల్స్‌పై సెన్సార్ అభ్యంతరం

Chitrajyothy 1 week ago

సినిమా టైటిల్స్ పెట్టే ముందే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఏమీ కాదనే నిర్లక్ష్య ధోరణి, అతి ఆత్మవిశ్వాసంతో టైటిల్‌ పెడితే...

సెన్సార్ అధికారులు ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. పాపులర్ పేర్లను యథాతథంగా వాడేసుకోవడాన్ని వారు సమ్మతించడం లేదు. అలానే ఆ టైటిల్ వల్ల నెగెటివ్‌ ఇంపాక్ట్ పడుతుందనిపించినా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ యేడాది మొదట్లోనే నాలుగైదు సినిమాల పేర్లు మార్చాల్సిందేనని పట్టుబట్టిన సెన్సార్ అధికారులు... జూలై 31న విడుదలై 'కామాఖ్య' మూవీ పేరు మార్చమనడంతో, విడుదలకు కొద్ది రోజుల ముందు ఆ సినిమా దర్శక నిర్మాతలు 'కర్మాఖ్య'గా దాన్ని మార్చారు. అలానే నిన్న గాక మొన్న 'చైనా పీస్' పేరు మీద కూడా సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో దాని పేరును 'సీక్రెట్ సోల్జర్' అని మార్చారు. ఇప్పుడు మరో సినిమా టైటిల్ ను మార్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి పూర్తిగా పేరు మార్చకుండా... తమ టైటిల్ కు ముందు రెండు అక్షరాలను జత చేసి మేకర్స్ సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్నారు. అదే 'చిరంజీవి'!.

కికు యనమల, కశిష్‌ ఖాన్ జంటగా నటించిన 'చిరంజీవి' సినిమాలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మించారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ఏప్రిల్ మాసంలో నాగబాబు ఆవిష్కరించారు. ఆ తర్వాత మూవీ టీజర్ కూడా విడుదలైంది. డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో ఉండే చిరు అనే యువకుడు తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను, సవాళ్లను, అరుదైన పరిస్థితిని ఎలా తట్టుకుని నిలబడ్డాడు, తను అనుకొన్నవి ఎలా సాధించాడు? అనేది ఈ చిత్ర కథాంశం.

ఇటీవల 'చిరంజీవి' సినిమా సెన్సార్ కు వెళ్ళినప్పుడు సీనియర్‌ స్టార్ హీరో చిరంజీవి పేరును ఈ సినిమాకు పెట్టడం సబబు కాదని, మార్చమని సెన్సార్ బృందం కోరినట్టు తెలుస్తోంది. దాంతో సినిమా టైటిల్‌కు ముందు హీరో 'కికు' పేరును జత చేసి, ఇప్పుడు 'కికు చిరంజీవి'గా మార్చారు. ఈ సినిమాను ఇదే నెల 28న మేకర్స్ విడుదల చేయబోతున్నారు. మరి భిన్నమైన కథాంశంతో వస్తున్న 'కికు చిరంజీవి'కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్‌లోకి వచ్చేసినట్టేనా?

తారక్ 'డ్రాగన్' షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే

NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy