Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NTR: 'రోటీ' ఆధారంగా 'నేరం నాదికాదు ఆకలిది'

NTR: 'రోటీ' ఆధారంగా 'నేరం నాదికాదు ఆకలిది'

Chitrajyothy 6 days ago

టరత్న యన్టీఆర్ అనేక హిందీ రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ నాటి హిందీ టాప్ స్టార్స్ ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, రాజేంద్రకుమార్ వంటి హీరోల సూపర్ హిట్ మూవీస్ ను తెలుగులో యన్టీఆర్ హీరోగా రీమేక్ చేసి విజయాలు సాధించారు మేకర్స్.

ఆ తీరున సాగిన స్టార్ హీరో మరొకరు తెలుగునాట కనిపించరు.యన్టీఆర్ హిందీ రీమేక్స్ లో కొన్ని అంతగా ఆకట్టుకోక పోయినా, అధికశాతం సూపర్ హిట్స్ గా నిలవడం విశేషం. ఆ కోవకు చెందిన చిత్రమే 'నేరం నాదికాదు ఆకలిది'. హిందీలో రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన 'రోటీ' ఆధారంగా 'నేరం నాదికాదు ఆకలిది' తెరకెక్కింది. అంతకు ముందు యన్టీఆర్ తో అనేక హిందీ రీమేక్స్ రూపొందించి విజయం సాధించిన యస్.డి.లాల్ దర్శకత్వంలోనే 'నేరం నాదికాదు ఆకలిది' రూపొందింది. 'నిప్పులాంటి మనిషి' నిర్మించి ఘనవిజయం సాధించిన వై.వి.రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మంజుల హీరోయిన్ గా నటించారు. 1976 జూలై 8వ తేదీన విడుదలైన 'నేరం నాదికాదు ఆకలిది' వసూళ్ళ వర్షం కురిపించింది.

'నేరం నాదికాదు ఆకలిది' చిత్రకథ విషయానికి వస్తే - చిన్నతనంలోనే కన్నవారిని పోగొట్టుకున్న విక్రమ్ ఆకలి మంటను చల్లార్చుకోవడం కోసం దొంగగా మారతాడు. తరువాత అతనిలో మార్పు వచ్చి మనిషిగా జీవించాలని ఆశిస్తాడు. అదే సమయంలో పోలీసులు వెంటాడుతారు. ఆ తప్పించుకొనే క్రమంలో అనుకోకుండా ఓ వ్యక్తిని పెనుగులాటలో నీళ్ళలోకి నెట్టేస్తాడు. అతని చిరునామా తెలుసుకొని, అంధులైన అతని కన్నవారిని ఆదుకుంటూ జీవిస్తాడు విక్రమ్. ఊరిలో జరిగే అన్యాయాలను విక్రమ్ ఎదిరిస్తాడు. గౌరీ అనే అమ్మాయి అతణ్ణి ప్రేమిస్తుంది.పెనుగులాటలో నీళ్ళలో పడ్డ అసలైన వారసుడు వస్తాడు.విక్రమ్ మంచితనం తెలుసుకుంటాడు. దుర్మార్గుల భరతం పట్టి విక్రమ్ అందరికీ మేలు చేయడంతో కథ సుఖాంతమవుతుంది. హిందీ 'రోటీ'లో హీరో-హీరోయిన్ మరణిస్తారు. యన్టీఆర్ ఇమేజ్ దృష్ట్యా తెలుగులో కథను సుఖాంతం చేశారు.

'నేరం నాదికాదు ఆకలిది' చిత్రానికి గొల్లపూడి మాటలు రాశారు. సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు రాయగా, సత్యం సంగీతం సమకూర్చారు. ఇందులో ప్రభ, గుమ్మడి, అల్లు రామలింగయ్య, మురళీమోహన్, త్యాగరాజు, పండరీబాయి ప్రధానపాత్రధారులు. యన్టీఆర్ చిత్రాల్లో మారువేషాలు వేయడం రివాజు. ఈ సినిమాలోనూ అదే తీరున మారువేషంలో అలరించారు రామారావు. 'నేరం నాదికాదు ఆకలిది'కి కొన్ని నెలల ముందు వచ్చిన యన్టీఆర్ మరో హిందీ రీమేక్ 'ఆరాధన' అప్పటికే బిగ్ హిట్ గా నిలచింది. మ్యూజికల్ హిట్ గా సాగిన 'ఆరాధన'ను తట్టుకొని 'నేరం నాదికాదు ఆకలిది' సైతం విజయం సాధించింది. ఈ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. రిపీట్ రన్స్ లో విశేషాదరణ చూరగొందీ చిత్రం.

ఇవి కూడా చదవండి:

'రామాయణ'.. అంత రేటు తగ్గడానికి కారణం ఏమిటి?

మహేష్ మమ్మల్ని మోసం చేశాడు.. సీక్రెట్ రివీల్ చేసిన మరదలు

Anjali: అతను రాఖీ కట్టినా వదలలేదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy