Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NTRNEEL: 'సలార్' వ్యూహంతోనే ఎన్టీఆర్ సినిమా గ్లింప్స్!

NTRNEEL: 'సలార్' వ్యూహంతోనే ఎన్టీఆర్ సినిమా గ్లింప్స్!

Chitrajyothy 1 week ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) పుట్టినరోజు (మే 20) సందర్భంగా మే 19వ తేదీ అర్ధరాత్రి.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న మూవీ (NTRNEEL) నుంచి అప్డేట్ రానున్న సంగతి తెలిసిందే.

తారక్ బర్త్‌డే కానుకగా రానున్న గ్లింప్స్‌లో సినిమాలోని కీలకమైన విజువల్స్ లేదా కథను ఎక్కువగా బయటపెట్టకుండా, కేవలం తారక్ రగ్గడ్ లుక్, సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్‌ను మాత్రమే హైలైట్ చేయనున్నారట. గతంలో ప్రభాస్ 'సలార్' (Prabhas Salaar) సినిమా కోసం ఎలాంటి వ్యూహాన్ని అయితే అనుసరించారో, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా ప్రశాంత్ నీల్ అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లడంలో నీల్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. 'సలార్' టీజర్‌లో 'డైనోసార్' అనే ఒక్క పదంతో దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించారో మనకు తెలిసిందే. ఇప్పుడు తారక్ సినిమా కోసం అంతకు మించిన పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్ లైన్స్‌ను నీల్ సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.

ఈ అప్డేట్ వినడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ, దీని వెనుక అంతే స్థాయి బాధ్యత, ఒత్తిడి కూడా ఉన్నాయనే విషయాన్ని దర్శకుడు, హీరో ఇద్దరూ గుర్తుంచుకోవాలని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గత ఏడాది నటించిన వచ్చిన 'వార్ 2' చిత్రానికి సంబంధించిన కొన్ని పరిణామాలు అభిమానులను కాస్త నిరాశకు గురిచేశాయి. ఆ అసంతృప్తి నుంచి ఫ్యాన్స్ పూర్తిగా బయటపడాలంటే, వారికి ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక్క సంజీవని ప్రశాంత్ నీల్ మాత్రమే. అందుకే ఈ సినిమా టీజర్ కేవలం బాగుంది అనిపిస్తే సరిపోదు, 'ఎక్స్‌ట్రార్డినరీ' అనే రేంజ్‌లో ఉండి తీరాలి. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఈ గ్లింప్స్ విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయని, వేరే పాత్రలను చూపించకుండా కేవలం ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌పైనే నీల్ పూర్తిగా ఫోకస్ పెట్టారని సమాచారం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో ఆవిష్కరించబోతున్నాడో చూపించడానికి ఈ చిన్న శాంపిల్ ఒక బలమైన పునాది కానుంది. అభిమానులు మరీ విపరీతమైన ఊహల్లో మునిగిపోకుండా, సినిమా మూడ్ ఎలా ఉండబోతోందో క్లియర్ కట్ హింట్ ఇవ్వడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అయితే ఈ క్రేజీ అప్‌డేట్‌కు సరిగ్గా ఒకరోజు ముందే పెద్ది సినిమా ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఒకవేళ ఆ ట్రైలర్ కనక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటే, సోషల్ మీడియా అంతా 'పెద్ది' హ్యాంగోవర్‌లోనే మునిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో, ఆ హడావిడిని తలదన్ని తన వైపు తిప్పుకునేలా ప్రశాంత్ నీల్ కట్ ఉండటం చాలా ముఖ్యం.

నిజానికి సగం షూటింగ్ కూడా పూర్తికాని ఒక కొత్త సినిమాను, విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమా ట్రైలర్‌తో పోల్చడం సాంకేతికంగా కరెక్ట్ కాదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ నేటి ఆన్‌లైన్ జనాలకు, ట్రోలర్లకు ఇలాంటి పట్టింపులు ఏమాత్రం ఉండవు. క్షణాల్లో కంపారిజన్లు మొదలుపెట్టి సోషల్ మీడియాలో రచ్చ లేపుతారు. అందువల్ల ఈ పోలికల తడాఖాను తట్టుకుని నిలబడాలంటే ఎన్టీఆర్ టీజర్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాల్సిందే. ఏదేమైనా ఆ రెండు రోజుల పాటు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి అన్ని సామాజిక మాధ్యమాలలో మునుపెన్నడూ చూడని ఒక పెద్ద హంగామా, ఫ్యాన్ వార్స్ చూడబోతున్నామనేది మాత్రం అక్షరసత్యం.

ఇవి కూడా చదవండి:

Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

లవ్‌ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

మోదీ 'పొదుపు మంత్రం'.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy