Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓజీ 2 మొదలు..  అదొక్కటే మార్పు

ఓజీ 2 మొదలు.. అదొక్కటే మార్పు

Chitrajyothy 2 days ago

పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ప్రజాసేవలో బిజీగా ఉన్నారు. పదవి రాకముందు ఒప్పుకొన్న సినిమాలను ఫినిష్ చేసి మాట నిలబెట్టుకున్న ఆయన...

పదవి వచ్చాక ఒక్క సినిమాను కూడా మొదలుపెట్టలేదు. దీంతో పవన్ సినిమాలు చేయరు అనుకున్నారు. కానీ, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్తను పవన్ కళ్యాణ్ అందించారు. గతేడాది ఓజీ సినిమాతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించిన పవన్.. తాజాగా ఓజీ 2 ని మొదలుపెట్టేశారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిన ఓజీ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మొదటిసారి పవన్ కళ్యాణ్ ని 300 కోట్ల క్లబ్ లో నిలబెట్టింది.

ఇక ఈ సినిమాకు సుజీత్ సీక్వెల్ ఉంటుందని ముందే చెప్పుకొచ్చాడు. కానీ, అది పవన్ ఒప్పుకొంటూనే అని కూడా చెప్పాడు. ఇక పవన్ ఎట్టకేలకు ఓజీ 2 కి ఓకే చెప్పేశారు. తాజాగా పవన్ - సుజీత్ ఓజీ యూనివర్స్ గురించి డిస్కషన్ చేస్తోన్న ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. దీంతో ఓజీ 2 మొదలైందని తెలుస్తోంది. అయితే ఓజీ 2 లో ఒక చిన్న మార్పు వచ్చి చేరింది. సాధారణంగా సీక్వెల్ అంటే నటీనటులు, స్టోరీ మారుతోంది. ఈసారి నిర్మాత మారారు.

ఓజీ చిత్రం డివివి దానయ్య బ్యానర్ లో తెరకెక్కింది. ఇక ఇప్పుడు ఓజీ 2 కి దానయ్య తప్పుకున్నారు. ఆ ప్లేస్ లో పీపుల్ మీడియా, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ వచ్చి చేరాయి. ఈ రెండు సంస్థలే ఓజీ 2 ని తెరకెక్కిస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఓజీని మించి సీక్వెల్ ఉండబోతోందట. అంతేకాకుండా సుజీత్.. యూనివర్స్ అనే పదం వాడడంతో అంతకుముందు తాను దర్శకత్వం వహించిన సాహో లో ప్రభాస్ ను కూడా ఓజీ2 లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి రికార్డులు బద్దలుకొడతారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy