Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఓజీ-2'.. సుజీత్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

'ఓజీ-2'.. సుజీత్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

Chitrajyothy 1 week ago

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యానికి సరికొత్త స్టైలిష్ లుక్‌ను అద్దిన చిత్రం 'OG'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా నిలిచింది.

ఒకప్పుడు ముంబైని తన చేతుల్లో ఉంచుకున్న ఒక గ్యాంగ్‌స్టర్, కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ అదే సిటీలోకి అడుగుపెడితే ఎలాంటి విధ్వంసం సృష్టించాడనే పాయింట్‌తో ఈ కథ సాగుతుంది.

ఇక పవన్‌ను ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త గ్యాంగ్‌స్టర్ లుక్‌లో సుజిత్ (Sujeeth) ప్రజెంట్ చేసిన విధానం, తమన్ అందించిన బీజీఎం, డీవీవీ దానయ్య నిర్మాణ విలువలు వెరసి ఈ సినిమాను ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ జోడీగా నటించిన ఈ మూవీలో, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ పవర్‌ఫుల్ విలనిజంతో మెప్పించారు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి స్టార్ కాస్టింగ్ ఈ యాక్షన్ డ్రామాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు ఇచ్చిన లీడ్‌తో అప్పట్లోనే పార్ట్-2 పై భారీ హైప్ క్రియేట్ అయింది.

ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఓజీ 2 (OG 2) గురించిన కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదట దర్శకుడు సుజీత్, నేచురల్ స్టార్ నాని (Nani) తో బ్లడీ రోమియో (Bloody Romeo) అనే ప్రాజెక్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా కాస్త ఆలస్యమైంది.

దాంతో సుజీత్ ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను ఈ గ్యాంగ్‌స్టర్ సీక్వెల్ పైనే పెట్టారు. ఈ సారి కథను ఊహించని రీతిలో, మరింత భారీ కాన్వాస్‌పై డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మొదటి భాగానికి కొనసాగింపుగానే కాకుండా.. పాత్రల పరిధిని, ఎమోషనల్ డ్రామాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

కథ ప్రకారం మొదటి భాగంలో పవన్ పాత్ర లోకల్ డాన్‌గా కనిపిస్తే, ఈ సీక్వెల్‌లో ఆయన క్యారెక్టర్‌ను ఒక గ్లోబల్ గ్యాంగ్‌స్టర్ రేంజ్‌లో ఎలివేట్ చేయబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో రివీల్ చేయని కొన్ని కీలకమైన ప్రశ్నలకు కూడా ఈ భాగంలో సమాధానాలు దొరకనున్నాయి. స్క్రీన్‌ప్లేలో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో పాటు, కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, స్టైలిష్ టేకింగ్ ఈ సీక్వెల్‌కి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పవన్ - సుజీత్ కాంబోపై ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమా పార్ట్-1 ను మించి మరింత వైలెంట్‌గా, గ్లోబల్ స్టాండర్డ్స్ లో థ్రిల్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy