Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే ఫ్రేమ్ లో పవన్, చిరు, చరణ్.. ఫ్యాన్స్ కి పూనకాలే

ఒకే ఫ్రేమ్ లో పవన్, చిరు, చరణ్.. ఫ్యాన్స్ కి పూనకాలే

Chitrajyothy 4 days ago

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్ సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరు.. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

ఇక ఇది కాకుండా మెగా 158 ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు. 'వాల్తేరు వీరయ్య'తో చిరుకు మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీ కొల్లి మెగా 158 కి దర్శకత్వం వహించనున్నారు.

ఇక మెగా 158 పూజా కార్యక్రమాలు మే 21 న అధికారికంగా జరగనున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ పూజా వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం అటెంట్ కానున్నారట. అంటే మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు. ఈ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు.

చాలా రేర్ గా ఈ ముగ్గురు కలిసి కనిపిస్తారు. ఎప్పుడు చిరు - చరణ్ కనిపిస్తారు కానీ, పవన్ చాలా తక్కువగా కనిపిస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి కనిపిస్తారు అని తెలియడంతో ఆ మూమెంట్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచుస్తున్నారు. మరి ఇందులో నిజమెంత తెలియాలి అంటే మెగా 158 పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy