Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓరి మీ దుంప తెగ.. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!

ఓరి మీ దుంప తెగ.. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!

Chitrajyothy 2 weeks ago

టీవల థియేటర్లకు వచ్చిన స్పైడర్ మ్యాన్ (Spider Man) చిత్రం భారత దేశంలోనూ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫ్యాన్స్ తమదైన శైలిలో ఈ సినిమాను ఓన్ చేసుకునిసెలబ్రేట్ చేస్తున్నారు.

స్పైడర్ మ్యాన్ స్టార్స్ టామ్ హాలెండ్ (Tom holland), జెండయా (Zendaya), సాడీ సింక్‌లకు సంబంధించిన ఫొటోలను ఏఐ ఉపయోగించి తెలుగు పాపులర్ సినిమా పాటలకు, సన్నివేశాలకు లింక్ చేస్తూ ప్రత్యేక వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 'పెద్ది' సినిమాలోని పాట పోస్టర్‌ను ఈ ముగ్గురితో కలిసి రీ క్రియేట్ చేయగా నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. వాటిని చూసిన వారంతా.. 'ఎంతకు తెగించార్రా.. మీ క్రియేటివిటీ తగలెయ్యా' అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేసి క్రియేట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా 'మీ దుంప తెగ.. ఇలా ఉన్నారేంట్రా మీరంతా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో.. సినిమాలో, రియల్ లైఫ్‌లోనూ లవర్స్ అయిన టామ్ హాలెండ్‌, జెండయా జంటకు తమిళ సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేయడమే గాక.. ఆ పెళ్లికి మార్వెల్ సూపర్ హీరోస్, అవెంజర్స్‌ హజరవడం, దగ్గరుండి పెళ్లి పనులు, వంట పనులు చేయడం వంటివి నవ్వులు పూయించేదిగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. మీరూ దీనిపై ఓ లుక్ వేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy