Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

Chitrajyothy 2 weeks ago

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జరుపుకుంటున్న మూడవ బర్త్ డే ఇది. కాబట్టి అందులో స్పెషల్ ఏమీలేదు. పోనీ పవన్ నటించిన సినిమాలు వస్తున్నాయా అంటే అదీ లేదు.

అయినా సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ బర్త్ డేను ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి కారణం త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2024 మేలో జరిగిన ఎన్నికల్లో లాగే ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. అందువల్ల రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో తమ హీరో పార్టీ 'జనసేన'ను విజయపథంలో పయనింప చేయాలని ఉన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న జరగనున్న పవన్ కళ్యాణ్ బర్త్ డేకు మునుపటి కంటే మిన్నగా ప్రత్యేకత సంతరించుకుంది.

తరగని ఉత్సాహం..

తెలుగు చిత్రసీమలో పవన్ హీరోగా అడుగు పెట్టిన తరువాత వరుసగా ఏడు బంపర్ హిట్స్ చవిచూశారు. తన తరం హీరోల్లో ఈ నాటికీ ఆ రికార్డ్ పవన్ పేరిటే పదిలంగా ఉంది. పవన్ రాజకీయాల్లోకి రాకముందు చివరి బిగ్ హిట్ ఏదంటే 2013లో వచ్చిన 'అత్తారింటికి దారేది' అనే చెప్పాలి. ఆ తరువాత జనం ముందు నిలచిన పవన్ కళ్యాణ్ సినిమాలేవీ ఆ స్థాయిలో అలరించలేకపోయాయి. పైగా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కూడా తక్కువ సినిమాల్లోనే నటించారు. అవేవీ అంతగా మురిపించలేకపోయాయి. అయితే ఏపీ డిప్యూటీ సీయమ్ అయిన తరువాత కూడా పవన్ సినిమాల్లో నటించి అలరించారు. అలా 'ఓజీ' సినిమా ఘనవిజయంతో మళ్ళీ ఫ్యాన్స్ లో జోష్‌ నింపారు పవన్. ఆ ఉత్సాహంతోనే ఈ బర్త్ డేను మరింత స్పెషల్ గా జరుపుకోవడానికి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

అయినా అదే తీరు...

పవన్ కళ్యాణ్ మళ్ళీ నటిస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పాలిటిక్స్ లో ఆయన ఎంతో బిజీగా ఉన్నారు. అయినా ఫ్యాన్స్ కు ఆనందం పంచడం కోసం 'ఓజీ' సినిమాకు సీక్వెల్ లో నటించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల కారణంగా 'ఓజీ' ఇప్పట్లో పట్టాలెక్కేట్టు కనిపించడం లేదు. అయినా తమ హీరో 'ఓజీ' సీక్వెల్ లో నటించి తమను మరింత ఆనందంలో ముంచెత్తుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పవన్ సైతం అభిమానులను అలరించడానికి ఏ మాత్రం వీలు దొరికినా నటించాలని చూస్తున్నారు. అన్నీసమకూరిన తరువాత సరైన సమయంలో 'ఓజీ' మొదలవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2న అభిమానులు ఈ సారి మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. రాబోయే పవన్ బర్త్ డేస్ నూ వారు ఇలాగే చేసుకుంటూ ఆనందిస్తారని చెప్పవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy