Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది.. పస లేదు.. ఇంకా ఏదో కావాలి

పెద్ది.. పస లేదు.. ఇంకా ఏదో కావాలి

Chitrajyothy 0 months ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi).

వృద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్‌ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. వీటికి మించి ట్రైలర్ ఉంటుంది అనుకుంటే.. అది మిక్స్డ్ టాక్ ను అందుకుంది. పెద్ది ట్రైలర్ బాగున్నా కూడా బుచ్చి కట్ చేసిన విధానం కన్ఫ్యూజ్ గా ఉందని పెదవి విరిచారు. మూడు ఆటలు చూపించి.. అందులో పెద్దినే తోపు అని చూపించారు. కానీ, అసలు కథను మాత్రం రివీల్ చేయలేదు. కేవలం ఈ ట్రైలర్ చరణ్ కి ఎలివేషన్స్ ఇవ్వడానికే రిలీజ్ చేసినట్లు ఉందని చెప్పుకొచ్చారు.

పెద్ది రిలీజ్ కి ఇంకా 10 రోజులు కూడా లేదు. వరుసగా ప్రమోషన్స్ లో చరణ్, జాన్వీ కనిపిస్తున్నా.. చరణ్ నటనకు అవార్డు ఖాయమని శివన్న చెప్తున్నా కూడా ప్రేక్షకులకు ఇంకా ఏదో కావాలని, పెద్దిలో పస లేదని అంటున్నారు. ఇక దీంతో మేకర్స్.. కథను రివీల్ చేస్తూ ఒక రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసే పనిలో పడ్డారట. ఇండస్ట్రీలో ఇదేమి కొత్త పద్దతి కాదు. మొదట ఒక ట్రైలర్ రిలీజ్ చేసి.. ప్రీ రిలీజ్ వేడుకకు ముందు కానీ, రిలీజ్ డేట్ కు రెండు రోజుల ముందు కానీ రిలీజ్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్ పేరుతో ఒక వీడియోని రిలీజ్ చేస్తారు. పెద్ది కూడా అదే పంథాలో నడుస్తోందని సమాచారం. రాబోయే సెకండ్ ట్రైలర్‌లో మాత్రం రామ్ చరణ్ పవర్‌ఫుల్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, క్రీడా నేపథ్యంలోని ఇంటెన్స్ ఎలిమెంట్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ లతో పాటు ఎమోషనల్ సీన్స్ ని కూడా యాడ్ చేయనున్నారట. మరి ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ చల్లబడతారేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy