Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. జాన్వీ కన్నా హైలైట్ గా నిలిచిన సుమ

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. జాన్వీ కన్నా హైలైట్ గా నిలిచిన సుమ

Chitrajyothy 5 days ago

సాధారణంగా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా హీరో, హీరోయిన్ హైలైట్ అవుతారు. ముఖ్యంగా హీరోయిన్.. ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో వారు తమ సినిమా టైటిల్ ని ప్రింట్ చేసిన చీర కానీ, డ్రెస్ కానీ ధరించి హైలైట్ అవ్వడం చాలా ఈవెంట్స్ లో చూస్తూనే ఉన్నాం.

హీరోలు సైతం షర్ట్స్ మీద సినిమా టైటిల్స్, హీరో లుక్ ని ప్రింట్ చేయించుకుంటున్నారు. కానీ, పెద్ది (Peddi) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కన్నా, రామ్ చరణ్ (Ram Charan) కన్నా యాంకర్ సుమ (Suma) హైలైట్ గా నిలిచింది.

స్టార్ హీరోల ఈవెంట్స్ అంటే సుమ కచ్చితంగా ఉండాల్సిందే. సినిమాకు తగ్గట్లు ఆమె ధరించే దుస్తులు ఆమెపై మరింత గౌరవాన్ని తీసుకొస్తాయి. ఎలాంటి అందాల ఆరబోత లేకుండా.. ఎంతో హుందాగా కనిపించడంలో సుమ ఎప్పుడు ముందు ఉంటుంది. ఇక ప్రతిసారిలా కాకుండా ఈసారి పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ మరింత హైలైట్ అయ్యింది. దానికి కారణం ఆమె కట్టుకున్న చీర. హీరోయిన్లు కట్టుకున్నట్లు సినిమా టైటిల్ థీమ్ ఉన్న చీరను ఆమె కట్టుకొచ్చింది. మెరూన్ కలర్ చీరపై బ్లాక్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ లో ఆమె అద్భుతంగా కనిపించింది.

ఇక సుమ కట్టుకున్న చీరపై పెద్ది పోస్టర్ ని ప్రింట్ చేశారు. సుమ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆ పెద్ది పోస్టర్ ని చూపిస్తూ స్పెషల్ చీర అని చెప్పుకొచ్చింది. జాన్వీ సైతం చీరలోనే వచ్చింది కానీ, పెద్దికి సంబంధించింది కాకుండా డిజైనర్ చీర కట్టుకుంది. దీంతో అందరి చూపు జాన్వీ కన్నా సుమ చీరపైనే ఉంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం సుమ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy