Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' సక్సెస్ చూసి నాకు 'ఠాగూర్'లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

'పెద్ది' సక్సెస్ చూసి నాకు 'ఠాగూర్'లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Chitrajyothy 1 month ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) కాంబోలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ 'పెద్ది' (Peddi).

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సక్సెస్‌ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో 'పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్' (Peddi Blockbuster Event)ని మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి నటించిన 'ఠాగూర్' సినిమాలోని డైలాగ్ గుర్తొస్తోంది అంటూ.. ఆసక్తికరంగా స్పీచ్ ఇచ్చారు.

''కొన్ని విజయాలు మనల్ని ఆనందపరుస్తాయి. కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే మనసు చాలా తృప్తిగా ఉంటుంది. 'పెద్ది' విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసిందని చెప్పగలను. 'పెద్ది' లాంటి అనుభూతి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అలాంటి గొప్ప అనుభూతిని ప్రేక్షకులు నాకు అందించారు. ఈ సినిమా ద్వారా నా గుండెల్లో జీవితాంతం దాచుకునే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అందుకే ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ. నేను సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వచ్చినట్లు అనిపించింది. చిన్న పిల్లలు 'మస్సా మస్సా' పాటకు డ్యాన్స్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పేరెంట్స్ ఎంత నమ్మకం పెడితే తమ పిల్లలను కూడా థియేటర్లకు తీసుకొస్తారో.. అది ఈ సినిమా ద్వారా తెలిసింది. ఇది బుచ్చిబాబు చేసిన ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం. చిన్నవాళ్లతో పాటు పెద్దవాళ్లు, ముసలివాళ్లు కూడా లుంగీలు కట్టుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. మళ్లీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో తెలియదు.

ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారంటే, రామ్ చరణ్‌ను మర్చిపోయి 'పెద్ది'నే గుర్తుపెట్టుకుంటారేమో అనిపిస్తోంది. ఆ విషయాన్ని మా ఇంట్లోనే నేను అనుభవించాను. 'పెద్ది' రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను 'నాన్న' అని పిలిచేది. సినిమా రిలీజ్ తర్వాత 'పెద్ది' అని పిలుస్తోంది. అలా పిలవద్దు అంటే.. 'పెద్ది నాన్న' అంటోంది. అలా ఇప్పుడందరికీ 'పెద్ది'నే గుర్తుంది. ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చిన బుచ్చిబాబుకు చాలా థాంక్స్. సుకుమార్ నా ఫేవరెట్ పర్సన్. నా జీవితంలో ఎప్పుడైనా డౌన్ మూమెంట్‌లో ఉంటే.. ఫస్ట్ గుర్తొచ్చేది సుకుమారే. నాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా ఆయనతో షేర్ చేసుకుంటాను. ఆయన లెక్చరర్‌గా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. నన్ను కూడా ఒక స్టూడెంట్‌లా చూసి గైడ్ చేయాలని నేను ఎప్పుడూ అడుగుతుంటాను. నిర్మాత సతీష్ కిలారు 'పెద్ది' సినిమాకు ఒక బలమైన పిల్లర్‌లా నిలబడ్డారు. మొదట ఎలా చేస్తారో అనుకున్నాను కానీ.. తొలి సినిమాకే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి, ఎక్కడా రాజీ పడకుండా నిలిచిన ఆయనకు థాంక్యూ సో మచ్. భవిష్యత్తులో కూడా ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. రత్నవేలు, రెహమాన్.. ఇలా అన్ని విభాగాల్లో ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ఈ సక్సెస్ చూస్తుంటే 'ఠాగూర్' సినిమాలోని ఒక డైలాగ్ గుర్తొస్తోంది. 'తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా ఎవరినీ ఇష్టపడరు. ఒకసారి ఇష్టపడితే చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటారు..' అనే డైలాగ్. అదే ప్రేమను అంతా 'పెద్ది'పై చూపించారు. ఈ సినిమాలోని మంచిని గుర్తించి ఆదరించిన ప్రతి ప్రేక్షక దేవుడికి నా సెల్యూట్. ఈ సినిమాకు రివ్యూలు ఇచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జాన్వీ కపూర్‌కు, అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాట చేసిన శృతి హాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మా బాబాయ్ పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను'' అని రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!

'వసుదేవసుతం'.. కృష్ణుడిపై వస్తోన్న మరో అద్భుతమైన సినిమా!

పారితోషికం పెంచను.. నాకంటూ ఒక రోజు వస్తుంది: ఐశ్వర్య లక్ష్మి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy