Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...

పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...

Chitrajyothy 4 days ago

జానపద గీతాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) రాసలీలలు బయటపడ్డాయి. తోటి ఫోక్ డ్యాన్సర్, నటి మాధురి రాథోడ్‌(Madhuri Rathod) తో అతడు వేములవాడలోని రెడ్డి భవన్‌లో ఉండగా..

ఈశ్వర్ సాయి భార్య వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో గుట్టు రట్టు అయ్యింది. అర్థరాత్రి సమయంలో ఒకే గదిలో ఇద్దరినీ చూసిన భార్య, తీవ్ర ఆగ్రహంతో మాధురిపై విరుచుకుపడింది.

ప్రసిద్ధ జానపద గీతం బాసింగ బలాలు పాటతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయికి ఇప్పటికే వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ, తనతో కలిసి పలు ఫోక్ సాంగ్స్‌లో నటించిన మాధురి రాథోడ్‌తో ఆయన పరిచయం పెంచుకుని, అక్రమ సంబంధం నడుపుతున్నాడని భార్య ఆరోపించింది. వేములవాడలోని రెడ్డి భవన్‌లో వీరిద్దరూ ఉన్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న భార్య, వారిని నేరుగా పట్టుకుని నిలదీసింది. నా భర్తే నీకు దొరికాడా? అంటూ ఆవేదనతో మాధురిపై చెయ్యి చేసుకుంది.

అనంతరం మీడియాతో ఈశ్వర్ సాయి భార్య మాట్లాడుతూ.. తన భర్త చాలా మంచివాడని, కనీసం మందు కూడా తాగే అలవాటు లేని వ్యక్తి అని ఆమె పేర్కొంది. మాధురియే ఉద్దేశపూర్వకంగా తన భర్త మీద పడి లొంగదీసుకుందని కన్నీటి పర్యంతమైంది. తమకు పెళ్లయి 7 ఏళ్లు అవుతోందని, తమ దాంపత్య జీవితంలోకి మాధురి ప్రవేశించి కుటుంబాన్ని కూల్చివేసిందని ఆరోపించింది.

గతంలో మాధురికి బ్రేకప్ అయిన సమయంలో తానే దగ్గరుండి ఓదార్చి, ఆదరించానని.. కానీ ఆమె తన పక్కనే ఉంటూ ఇలా వెన్నుపోటు పొడుస్తుందని అనుకోలేదని ఆవేదన చెందింది. ఇలాంటి వారి వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి ఎంతమాత్రం రానివ్వకూడదంటూ ఈశ్వర్ భార్య భావోద్వేగానికి లోనయ్యింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వైపు క్రేజీ ఫోక్ సాంగ్స్‌తో సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈశ్వర్ సాయి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం జానపద కళారంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy