Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభాస్‌తో 'ధురంధర్' దర్శకుడి మూవీ.. అధికారిక ప్రకటన ఆరోజేనా!

ప్రభాస్‌తో 'ధురంధర్' దర్శకుడి మూవీ.. అధికారిక ప్రకటన ఆరోజేనా!

Chitrajyothy 3 weeks ago

'ధురంధర్' (Dhurandhar) సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar). 'ధురంధర్'కు పార్ట్ 3 ఉంటుందా?

లేదా? అనేది కాకుండా.. ఇప్పుడాయన చేయబోయే తదుపరి సినిమా హీరో ఎవరనేలా కొన్ని రోజులుగా బాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా వార్తలు హైలెట్ అవుతోన్న విషయం తెలిసిందే. ఒకసారి రామ్ చరణ్ అని, మరోసారి అల్లు అర్జుణ్ అని.. ఇలా సౌత్ ఇండియాకు చెందిన సూపర్ స్టార్‌తో సినిమా అంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు సౌత్ సినీ వర్గాల్లో ఇప్పుడో ప్రచారం టాక్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీగా మారింది.

అదేంటంటే.. రెబల్ స్టార్ ప్రభాస్‌ (Rebel Star Prabhas)తో ఆదిత్య ధర్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడట. ఈ సినిమా భారీ పాన్-ఇండియా చిత్రంగా ఉంటుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ప్రభాస్ పుట్టినరోజు నాడు వెలువడనుందనేది ఈ ప్రచారంలో హైలెట్ అవుతోన్న అంశం. రీసెంట్‌గా దర్శకుడు ఆదిత్య ధర్ హైదరాబాద్‌లో ప్రభాస్‌ను కలిసి ఒక కథను వినిపించినట్లు సౌత్ సినీ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. అంతే.. ప్రభాస్‌కు ఆ లైన్ నచ్చిందని, ఈ ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేలా ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాల ప్రకారం.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.

మరి ఈ ఊహాగానాలు ఎంత వరకు నిజం అవుతాయి? నిజంగా ప్రభాస్, ఆదిత్య ధర్ కాంబోలో మూవీ ఉంటుందా? అనేది కాలమే చెప్పాలి. అప్పటి వరకు అయితే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాస్తవానికి ఈ కాంబో సెట్ అయిందని అనుకున్నా.. సెట్స్‌పైకి వెళ్లడానికి, రిలీజ్ కావడానికి సంవత్సరాల టైమ్ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రభాస్ లైనప్ అలా ఉంది. మరి అప్పటి వరకు ఆదిత్య ధర్ వెయిట్ చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ కాంబోలో మూవీ అంటే మాత్రం నమ్మడం కష్టమే. కాకపోతే ఈ కాంబోలో సినిమా అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం.. యమా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రశ్నించడం అంటే ఇదేనా? రావణ్‌పై రామ్ తాళ్లూరి ఫైర్

Spirit: 'స్పిరిట్‌' పరుగులే.. సందీప్‌ వంగా స్పీడ్‌కు ఫ్యాన్స్ హ్యాపీ!

ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'.. ఎప్పుడంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy