Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Prabhas: అదిరా ప్రభాస్ రేంజ్.. వరుసగా నాలుగోసారి

Prabhas: అదిరా ప్రభాస్ రేంజ్.. వరుసగా నాలుగోసారి

Chitrajyothy 4 days ago

బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిని ఉద్దేశించి బిజ్జలదేవ ఒక డైలాగ్ చెప్తాడు. వీడు ఎక్కడున్నా రాజేరా అని.. అది సినిమాలో అన్నా బయట కూడా ఆ డైలాగ్ కేవలం ప్రభాస్(Prabhas) కే వర్తిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

ప్రభాస్.. ఎక్కడున్నా రాజే అని మరోసారి రుజువు చేశారు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా నాలుగుసార్లు ఆర్మాక్స్ మీడియాలో నాలుగోసారి మొదటి స్థానంలో నిలబడ్డారు.

ఆర్మాక్స్ మీడియా అనేది భారతదేశంలోని ప్రముఖ మీడియా కన్సల్టింగ్ మరియు డేటా అనలిటిక్స్ సంస్థ. సినిమా పరిశ్రమ, టెలివిజన్ మరియు ఓటీటీ (OTT) రంగాలకు సంబంధించిన కంటెంట్, స్టార్స్ పాపులారిటీపై ఇది ప్రతి నెలతో పాటు ప్రతి ఏటా ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తుంది. తాజాగా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్ ని ఆర్మాక్స్ విడుదల చేసింది. అందులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ప్రభాస్. గత నాలుగేళ్లుగా ప్రభాస్ నే నెంబర్ 1 మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

ఈసారి కూడా డార్లింగే మొదటి స్థానంలో ఉన్నారు. ఇక ఈసారి టాప్ 10 లో ఎక్కువగా టాలీవుడ్ హీరోలు ఉండడం విశేషం. ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా.. అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక 5 వ స్థానంలో మహేష్ బాబు.. 7వ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. చివరగా టాప్ 10 లో ఎన్టీఆర్ నిలబడ్డారు. టాప్ 10 లో 5 స్థానాలు టాలీవుడ్ స్టార్స్ నిలబడడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్.. అదిరా డార్లింగ్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy