'ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఫ్రమ్ టాలీవుడ్' అంటూ జేజేలు అందుకుంటున్నారు ప్రభాస్ (Prabhas). అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆయన పుట్టినరోజు ఓ పర్వదినం.
ఈ సందర్భంగా విషెస్ చెబుతూ ప్రభాస్ మూవీ జర్నీని గుర్తు చేసుకుందాం. 'బాహుబలి' (Baahubali) సిరీస్‌లో నటించిన తరువాత ప్రభాస్‌కు ఇంటర్నేషనల్ ఫేమ్ దక్కింది. ఆ తరువాత వచ్చిన ప్రభాస్ మూవీస్ ఎలా ఉన్నా భారీ వసూళ్ళు పోగేయడం మొదలైంది. ఓవర్సీస్‌లో అంతకు ముందు కనీవినీ ఎరుగని రికార్డులను ప్రభాస్ సినిమాలు సొంతం చేసుకోవడం మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో 'ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా' (First International Star of India) అని కొందరు కీర్తించారు. అయితే మరికొందరు టాలీవుడ్ నుండి ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన తొలి హీరో అని ప్రశంసించారు. ఎవరు ఏమనుకున్నా, ఇప్పటికీ తొలి సినిమా 'ఈశ్వర్' నాటి ప్రభాస్ లాగే అందరినీ నవ్వుతూ 'డార్లింగ్' అంటూ సంబోధిస్తూ సరదాగా సాగుతున్నారు ప్రభాస్. ఆయన పుట్టినరోజయిన అక్టోబర్ 23న అభిమానులు పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
తన ఫ్యాన్స్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రభాస్ ఆశిస్తూంటారు. వారితోనూ అదే చెబుతూంటారు. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ', 'స్పిరిట్' సినిమాలతో పాటు.. 'సలార్, కల్కి 2898 ఏడి' సినిమాల సీక్వెల్స్ లోనూ నటించాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ సైతం ప్రభాస్ కోసం ఎదురుచూస్తున్నాయి. టాలీవుడ్‌లో ఇంత బిజీగా సాగుతున్న స్టార్ హీరో మరొకరు కానరారు. ఈ ఏడాది ప్రభాస్ నటించిన 'ద రాజాసాబ్' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అభిమానులు నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ తమ హీరో రాబోయే సినిమాలతో మరింతగా మురిపిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సారి అక్టోబర్ 23తో ప్రభాస్‌కు 47 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ పుట్టినరోజు తరువాత ప్రభాస్‌కు అంతా మంచే జరుగుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన పెళ్లి కబురు కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ప్రభాస్ సైతం ఫ్యాన్స్‌కు ఆనందం పంచడానికి బర్త్ డేన ఆయన నటించిన కొత్త సినిమాల లుక్స్, టీజర్స్‌తో అలరించే ప్రయత్నంలో ఉన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. వచ్చే యేడాది నుంచి ఒకే సమయంలో సమాంతరంగా రెండు సినిమాల్లో నటించాలని ప్రభాస్ ప్లాన్ రూపొందించుకున్నారు. ఆ తీరున ఇకపై ఏడాదికి రెండు చిత్రాలతో అభిమానులకు ఆనందం పంచనున్నారు ప్రభాస్. ఈ యేడాది చివరలో 'ఫౌజీ' వెలుగు చూస్తుందని ఆశించారు. అయితే ఆ సినిమా ఆలస్యం కానుందని తెలుస్తోంది. అలాగే 'స్పిరిట్' కూడా మరింత వెనక్కి జరిగేలా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే సంవత్సరం తప్పకుండా ప్రేక్షకులను పలకరిస్తాయని తెలుస్తోంది. ఆ తరువాత మరింత స్పీడు పెంచి అటుపై ఏడాదికి మూడు సినిమాలనైనా రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ప్రభాస్. మరి రాబోయే సినిమాలతో ప్రభాస్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి. ప్రభాస్‌కు మరిన్ని సక్సెస్‌లు రావాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం. హ్యాపీ బర్త్‌డే ప్రభాస్ (Happy Birthday Prabhas).
:
నిజమైన హీరోలేనా.. లేక 'డూప్'లా? 'జైలర్ 2'తో మొదలైన కొత్త చర్చ
'రామాయణ' టికెట్ ధరలు.. దిల్ రాజు కీలక నిర్ణయం
స్టార్ హీరోతో ప్రభుదేవా సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్ రీఎంట్రీ

