Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ లాంఛనాలతో.. ముగిసిన దేవా అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో.. ముగిసిన దేవా అంత్యక్రియలు

Chitrajyothy 3 days ago

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (Deva) అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. టి.నగర్ లోని ఆయన నివాసంలో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం 11 గంటల వరకు భౌతికకాయాన్ని ఉంచగా..

సీఎం విజయ్, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఎన్ఎంకే కన్వీనర్ సీమాన్, నటి రాధిక, సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్, నటి ఖుష్బూ కడసారిగా దర్శించి అంజలి ఘటించారు. అనంతరం ఉమ్మడి వేలూరు జిల్లా ఆర్కాట్ సమీపంలోని చక్రమల్లూరు గ్రామంలోని దేవాకు చెందిన ఎస్టేట్‌కు ఆయన పార్థివదేహాన్ని తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసినట్టు హీరో జై, దేవా సోదరుడు సంపత్ వెల్లడించారు.

దేవా అంతిమయాత్రలో దారిపొడవునా ఆయన అభిమానులు నివాళులర్పించారు. అంతకుముందు దేవా మృతిపై ప్రముఖ సంగీత దర్శ కుడు ఏఆర్.రెహ్మాన్ ట్వీట్ చేస్తూ.. 'దేవా లేరనే వార్త బాధాకరం. తమిళ సంగీతం ఆత్మతో పెనవేసుకున్న ఆయన మధురమైన గీతాలు ఎన్నో తరాల హృదయాలను తాకాయి. అవి భవిష్యత్‌లో కూడా నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి' అని అన్నారు. దర్శకుడు సురేష్ కృష్ణ స్పందిస్తూ.. 'దేవాతో కలిసి ప్రయాణం ప్రారంభించి 35 యేళ్ళు. అతనితో కలిసి 29 చిత్రాలకు పనిచేశాను. 'అన్నామలై'తో మొదలైన ఆ ప్రయాణం 'చారుకేశి' వరకు సాగింది. ఈ 35 యేళ్ళ జర్నీలో ఎన్నో పాటలు, ఎన్నో ఆనంద కాఫీలు సేవించాం. నన్ను చూసినపుడల్లా ఆనంద్ కాఫీ తాగేందుకు వెళదామా? అంటూ ఆప్యాయంగా అడిగేవారు. థియేటర్లలో ఆయనతో గడిపిన క్షణాలు వీడియోల రూపంలో పదిలంగా దాచుకుంటాను' అని పేర్కొన్నారు.

:

బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' ర్యాంపేజ్.. తెలుగు రాష్ట్రాల్లో 'విరోష్' సందడి

'జైలర్ 2' సెట్‌లో మోహన్ బాబు.. 'జైలర్ 3'లో ఏమైనా?

లాస్ ఏంజెల్స్‌లో 'రామాయణ' హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy