Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన.. గ్లోబల్ స్టేజ్‌పై వారణాసి హంగామా!

ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన.. గ్లోబల్ స్టేజ్‌పై వారణాసి హంగామా!

Chitrajyothy 2 weeks ago

ర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ ఎపిక్ 'వారణాసి' ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్‌ చేస్తోంది.

యూరప్‌లోని లే గ్రాండ్ రెక్స్‌లో ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుత స్పందన రాగా.. మెక్సికో కామిక్ కాన్‌లో కూడా ఈ సినిమా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దీంతో టీమ్ తెగ ఖుషీ అవుతోంది. ఆ బజ్ ను డబుల్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అందుకే మరోసారి ఇంటర్నేషనల్ ప్రమోషన్స్‌కు ఆయన శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఓ వైపు శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే... మరో వైపు ఛాన్స్ వచ్చినప్పుడల్లా గ్లోబల్ ప్రమోషన్స్ చేస్తున్నారు రాజమౌళి. దశల వారిగా అంతర్జాతీయ వేదికలపై హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే మెక్సికో ఈవెంట్ సక్సెస్ కావడంతో త్వరలో ఫ్రాన్స్‌లో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జూన్ చివరి నుంచి రాజమౌళి 'సిరీస్ ఆఫ్ ఈవెంట్స్' ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటనలో సినిమాకు సంబంధించిన కీలక అంశాలను ఆడియెన్స్‌తో పంచుకోనున్నారట. జక్కన్న ప్లాన్ చేసిన ఈ ప్రమోషనల్ టూర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందని ఎస్ ఎస్ కార్తికేయ హింట్ ఇచ్చారు. దీంతో జక్కన్న మార్కెటింగ్ వ్యూహానికి ఫిదా అవుతున్నారు మూవీ లవర్స్.

ఇదిలా ఉంటే మెక్సికోలో జరిగిన ఈవెంట్‌లో 'వారణాసి' సినిమాలో మైథలాజికల్ టచ్ ఉన్న సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, రామాయణ నేపథ్యంలో 20 నిమిషాల పాటు ఆ ఎపిసోడ్ ఉంటుందని కార్తికేయ అన్నారు. ఇండియన్‌, మెక్సికన్ కథల మధ్య చాలా పోలికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆహారపు అలవాట్లు, కుటుంబ విలువలు వంటి విషయాల్లో రెండు దేశాల మధ్య ఉన్న పోలికల వల్లే ఈ సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు ఈజీగా కనెక్ట్ అవుతుందని వెల్లడించారు.

'వారణాసి'లో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధాన బలంగా ఉంటాయని కార్తీకేయ వివరించారు. అయితే త్వరలో జరగనున్న ఫ్రాన్స్ ఈవెంట్‌లో ఎలాంటి సీక్రెట్స్ రివీల్ చేస్తారోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి 'వారణాసి' కేవలం ఒక సినిమాగా కాకుండా గ్లోబల్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. మరీ 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy