Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమ కోసం ఏదైనా చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ - దర్శకుడు

ప్రేమ కోసం ఏదైనా చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ - దర్శకుడు

Chitrajyothy 1 week ago

త్తుల సరస్వతి సమర్పణలో.. కళ్యాణ్ ప్రొడక్షన్స్ (Kalyan Productions) బ్యానర్‌ పై బత్తుల కోటేశ్వరరావు (Bathula Koteswara Rao) నిర్మిస్తోన్న చిత్రం 'పురుష:' (Purushaha).

ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల (Pavan Kalyan Bathula) హీరోగా పరిచయమవుతున్నారు. వీరు వులవల దర్శకత్వం రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు.. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమా మే 22న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, రిలీజ్‌ను పురస్కరించుకుని జరుగుతున్న ప్రమోషన్స్‌లో చిత్ర దర్శకుడు వీరు వులవల (Veeru Vulavala).. మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

''నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేయడం అలవాటు. చిన్నప్పుడు హీరోల బొమ్మల్ని క్లాత్ మీద పెయింటింగ్ వేసేవాడిని. వాటిని థియేటర్ల ముందు అందరూ కట్టుకునేవారు. ఆ తర్వాత బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఏ పని చేసినా సరే నేను ఇండస్ట్రీలోనే ఉండాలని అనుకున్నాను. ఆ టైంలోనే 'కొత్త బంగారు లోకం' టైటిల్‌ను రాసి, డిజైన్ చేశాను. అలా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇలా చాలా మంది హీరోలకు దాదాపు 350కి పైగా టైటిల్స్‌ని రాసి, డిజైన్ చేశాను. ఈ 'పురుష:' కథ విషయానికి వస్తే.. ఈ కథను రెడీ చేసుకుని, ఇండస్ట్రీలో తిరుగుతున్న టైమ్‌లో 'మసూద' సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మూడు నెలల పాటు చాలా సీరియస్‌గా వర్క్ చేశాను. ఎంతో మందికి నా కథను వినిపించాను. అప్పుడు ఓ సారి బత్తుల కోటేశ్వరరావు (ఈ చిత్ర నిర్మాత) వద్దకు కథ వెళ్లింది. గోవింద్ (పవన్ కళ్యాణ్), కమల (రాయంచ) ప్రేమ కథ మెయిన్ పాయింట్. కాకపోతే సపోర్టింగ్ పాత్రలు ఎక్కువగా ఉంటాయని ఆయనకు చెప్పాను. ఆ కథను విన్న తర్వాత ఆయనకు చాలా నచ్చింది. ఇలాంటి సినిమా అయితేనే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి మా అబ్బాయి రీచ్ అవుతాడని, ఆయన వెంటనే ఓకే చెప్పారు.

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేను. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క విషయంలో మమ్మల్ని ప్రశ్నించలేదు. ప్రతీ ఒక్క స్టేజ్‌లో మా టీమ్‌ని ప్రోత్సహించారు. ఆయన కుమార్తె సరస్వతి అయితే ప్రతీ రోజూ సెట్‌లో మా అందరినీ ఎంతో చక్కగా చూసుకున్నారు. వారిద్దరి సపోర్ట్‌తోనే సినిమాని ఇంత బాగా తీయగలిగాను. సినిమా చూసిన తర్వాత నిర్మాత కోటేశ్వరరావు నన్ను పట్టుకుని ఏడ్చేశారు. ఇది నా 26 ఏళ్ల కల అని కన్నీరు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో ప్రేమ కోసం ఏమైనా చేసే ఓ మంచి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. సప్తగిరి, కసిరెడ్డి పాత్రలు అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇందులో కసిరెడ్డి పాత్ర కోసం రాసిన డైలాగ్స్ బాగా అలరిస్తాయి. వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, వెన్నెల కిషోర్.. ఇలా చాలా పాత్రలుంటాయి. ప్రతీ ఒక్క పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్‌తో కిటికీ వద్ద ఉండే ఎపిసోడ్‌ ఒకటి ఉంటుంది. ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు థియేటర్లో అందరూ పగలబడి నవ్వుతారు. ఆ సర్‌ప్రైజ్ మూమెంట్ ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. సినిమాకి ఈ ఎపిసోడ్ హైలెట్‌గా ఉంటుంది. ఈ కథ పుట్టుకకు కారణం 'జెర్సీ' మూవీ. గౌతమ్ తిన్ననూరి 'మళ్లీ రావా' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ తర్వాత 'జెర్సీ'కి పనిచేస్తున్న సమయంలో ఈ ఆలోచన వచ్చింది. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా..' అనే పాయింట్‌తో ఈ కథను స్టార్ట్ చేశాను. భార్యాభర్తలపై స్టోరీని రాయాలని అనుకున్నాను. కాకపోతే, ఫీమేల్ ఓరియెంటెడ్ కథలెన్నో మనం చూశాం. అందుకే ఇది మేల్ ఓరియెంటెడ్‌గా తీయాలని అనుకున్నాను. ఇలాంటి జానర్ ఒకటి ఉందా? అని అనుకున్నాను. అలా కథ పూర్తి చేశాను. ఈ కథను చాలా మందికి వినిపించాను. ప్రతీ రిజెక్షన్‌తో కథలో ఒక్కో డెవలప్‌మెంట్ చేశాను. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుంది.

పవన్ కళ్యాణ్ కొత్త ఆర్టిస్ట్. సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా అనుకున్న తర్వాత వెంటనే షూటింగ్‌కి వెళ్లలేదు. ఓ రెండు నెలల పాటుగా వర్క్ షాప్స్ నిర్వహించాం. ఆ తర్వాతే షూటింగ్‌కి వెళ్లాం. మొత్తం 51 రోజుల పాటు చిత్రీకరించాం. కాకినాడలోనే ఎక్కువగా సినిమాని షూట్ చేశాం. కెమెరామెన్ సతీషే ఈ నిర్మాతను పరిచయం అయ్యారు. నేచురల్ లొకేషన్స్‌లోనే దాదాపుగా షూటింగ్ చేశాం. ఇందులో ఆరు పాటలుంటాయి. ప్రతీ పాట చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. 'మళ్లీ రావా' నుంచీ నాకు మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ పరిచయం. మంచి పాటలతో పాటుగా, అద్భుతమైన ఆర్ఆర్ కూడా ఇచ్చారు. అందరూ నాకు గొప్పగా సహకరించారు. ప్రస్తుతం నా దగ్గర యాక్షన్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ జానర్లలో కథలు రెడీగా ఉన్నాయి. ఈ సినిమాలోనూ కొన్ని చోట్ల హరర్, థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా 'పురుష:' ఉంటుంది. కుటుంబ సమేతంగా థియేటర్‌కి వచ్చి, ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను'' అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

లేటు వయసులో ఖరీదైన 'పోర్షే' లగ్జరీ కారు.. సీనియర్ నరేశ్ జల్సానే జల్సా! ఖరీదెంతో తెలుసా?

Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

లవ్‌ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy