Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజకీయాల్లోకి రామ్ చరణ్.. అంత మాట అనేశాడేంటి

రాజకీయాల్లోకి రామ్ చరణ్.. అంత మాట అనేశాడేంటి

Chitrajyothy 3 days ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన నటించిన తాజా చిత్రం పెద్ది (Peddi) రిలీజ్ కి రెడీ అవుతోంది.

బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 4 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చరణ్.. పాన్ ఇండియా లెవెల్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ .. పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. మీ నాన్న చిరంజీవి, మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా.. ? అన్న ప్రశ్నకు రామ్ చరణ్ మాట్లాడుతూ.. ' నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. నేను వినోద రంగంలో నేను అత్యుత్తమంగా, అగ్రస్థానంలో నిలవాలని మాత్రమే కోరుకుంటున్నాను. రాజకీయాల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మా నాన్న, బాబాయ్ ని రాజకీయాల్లో చూసాను. నాకు అలాంటి ఆశ లేదు. నేను రెండు పడవలపై ప్రయాణించదలుచుకోలేదు. సినిమాలు నాకు చాలు' అని చెప్పుకొచ్చాడు.

చరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి కొన్నేళ్ళ క్రితం పార్టీ పెట్టి... రాజకీయాల్లో నెగ్గలేక మళ్ళీ సినిమాల వైపుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ పోరాటం చేసి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఉంటూ కూడా సినిమాలు చేస్తున్నారు. ఇక వీరి తరువాత రామ్ చరణ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడేమో అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, చరణ్ రాజకీయాల గురించి ఆలోచన లేదు అనేసరికి అదేంటి చరణ్ అంత మాట అనేసాడు అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి చిరు, పవన్ తరువాత కొణిదెల కుటుంబం నుంచి రాజకీయ వారసుడు ఎవరు అవుతారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy