Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ చరణ్ కి మరో సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్

రామ్ చరణ్ కి మరో సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్

Chitrajyothy 1 week ago

హీరోలు కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనేది మాత్రమే బయటకు తెలుస్తుంది. కానీ, ఒక సినిమా కోసం వారు ఎంత ప్రాణం పెడతారు అనేది మాత్రం చాలా తక్కువమందికే తెలుస్తుంది.

యాక్షన్ సీన్స్ లో గాయాలపాలై.. సర్జరీలు చేయించుకొని.. ఆ నొప్పిని జీవితాంతం అనుభవిస్తూ ఉంటారు. బాహుబలి సమయంలో ప్రభాస్ మోకాలికి అయిన గాయం ఇప్పటికీ తగ్గలేదు. ప్రభాస్ ఇప్పటికీ దానికి సర్జరీ చేయించుకుంటూనే ఉన్నాడు. తాజాగా రామ్ చరణ్ (Ram Charan) సైతం పెద్ది షూట్ లో గాయపడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పెద్ద గాయాలు అయ్యాయట.

రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 4 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. తాజాగా పెద్ది నిర్మాత సతీష్ కిలారు ఒక ఇంటర్వ్యూలో పెద్ది కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా యాక్షన్ సీన్స్ లో చరణ్ కి మూడు పెద్ద గాయాలు అయ్యాయని, అయినా లెక్కచేయకుండా చరణ్ సినిమాను పూర్తిచేసినట్లు తెలిపాడు.

' పెద్ది కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా షూటింగ్ లో చరణ్ కి మూడు పెద్ద గాయాలు అయ్యాయి. అయినా షూటింగ్ కి ఆయన బ్రేక్ ఇవ్వలేదు. కంటికి మాత్రమే దెబ్బ తగిలిందని బయటకు తెలిసింది. దానికి వైద్యులు సర్జరీ చేశారు. అది కాకుండా చేతి మణికట్టుకు కూడా పెద్ద గాయం అయ్యింది. నొప్పి తగ్గిపోతుందిలే అని చరణ్ షూటింగ్ కంటిన్యూ చేసాడు. కానీ, ఇప్పుడు ఆ నొప్పి తీవ్రమయ్యింది. డాక్టర్ ని సంప్రదిస్తే దానికి కూడా సర్జరీ చేయాలనీ చెప్పారు. ఎల్లుండి చరణ్ మణికట్టుకు సర్జరీ జరగనుంది. ఇక వీటితో పాటు కుస్తీ చేసేటప్పుడు కాలు కూడా బెణికింది. అక్కడే ఫిజియో చేయించుకొనేవాడు. పెద్ది కోసం చరణ్ ప్రాణం పెట్టాడు. సినిమా చూస్తే అది ప్రేక్షకులకు అర్ధమవుతుంది' అని తెలిపాడు. ఇక నిర్మాత వ్యాఖ్యలు విన్నాక ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy