Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!

Chitrajyothy 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana) దంపతులు.. తమ వివాహ వార్షికోత్సవం (Wedding Anniversary) సందర్భంగా అభిమానులకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు.

తమ ముద్దుల కవల పిల్లలు 'శివరామ్ కొణిదెల' (Shivram Konidela), 'అన్వీరా దేవి కొణిదెల' (Anveera Devi Konidela) లకు సంబంధించిన మొదటి అందమైన గ్లింప్స్‌ను వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'హార్ట్ ఈజ్ ఫుల్' (మనసు నిండిపోయింది) అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ చిత్రం చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు ఈ సర్‌ప్రైజ్‌కు ఫిదా అవుతున్నారు. అంతేకాదు.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఉపాసన షేర్ చేసిన ఈ ప్రత్యేకమైన చిత్రంలో కవల పిల్లల చిరు చేతులు ఒకరినొకరు తాకుతూ, ప్రేమపూర్వకంగా పట్టుకుని ఉండటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పసిపిల్లల ముద్దు ముద్దు చేతులకు బంగారు గాజులు మెరుస్తుండగా, పక్కనే ఉన్న మరో చేతి స్పర్శ (బహుశా క్లీంకార చేయి అయి ఉండవచ్చు) ఈ ఫొటోలో ఎంతో భావోద్వేగాన్ని నింపింది. తమ జీవితంలోకి వచ్చిన ఈ కొత్త వెలుగులను చూసి ఆ తల్లిదండ్రుల మనసు ఎంతలా ఉప్పొంగిపోతుందో ఈ ఒక్క పోస్ట్‌తో స్పష్టమవుతోంది.

ఈ అపురూపమైన క్షణాన్ని చూసిన సెలబ్రిటీలు, అభిమానులు రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, శివరామ్, అన్వీరా దేవిలకు తమ ఆశీస్సులు అందిస్తున్నారు. మెగా కుటుంబంలోకి ఒకేసారి ఇద్దరు చిన్నారులు రావడం.. వారిని చరణ్, ఉపాసనలకు ఎంతో ప్రత్యేకమైన రోజున పరిచయం చేయడం మెగా అభిమానులకు అసలైన పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ క్యూట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రామ్ చరణ్, ఉపాసనల వివాహం 2012, జూన్ 14వ తేదీన గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

సినీ నటి గౌతమి సంచలన నిర్ణయం

బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్

దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy