Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామాయణ ట్రైలర్.. ఆ చీరలేంటి.. ఆ మేకప్ ఏంటి

రామాయణ ట్రైలర్.. ఆ చీరలేంటి.. ఆ మేకప్ ఏంటి

Chitrajyothy 3 weeks ago

భారతీయ చలనచిత్ర రంగాన రామాయణం (Ramayanam) అంటే కేవలం ఒక పౌరాణిక చిత్రం మాత్రమే కాదు, కోట్లమంది భక్తుల భావోద్వేగం. గతంలో బి.ఆర్‌. చోప్రా, రామానంద్ సాగర్ సీరియల్స్ దగ్గర నుంచి మన తెలుగులో వచ్చిన సంపూర్ణ రామాయణం, శ్రీరామరాజ్యం, లవకుశ వంటి సినిమాల్లో పాత్రలు, వారి దుస్తులు, అలంకరణ త్రేతాయుగపు రాచరికాన్ని, ఆధ్యాత్మిక పవిత్రతను కళ్లకు కట్టినట్లు చూపించేవి.

కానీ,ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తీస్తున్న రామాయణ ట్రైలర్ చూశాక, ఆ ప్రాచీన నేటివిటీ స్థానంలో బాలీవుడ్ మోడ్రనైజేషన్ వచ్చి చేరిందనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ వంటి అగ్ర తారలు నటిస్తుండటంతో రామాయణ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ని ఈమధ్యనే మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కైకేయి పాత్రలో కనిపించిన లారా దత్తా, సీతాదేవిగా నటించిన సాయి పల్లవి కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్ లుక్స్ చూసిన నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అప్పట్లో దేవతా మూర్తుల రూపాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్లు ఉండే డిజైనింగ్ స్థానంలో.. ఇప్పుడు నేటితరం సెలూన్ మోడల్ హెయిర్ స్టైల్స్, మోడ్రన్ రీతిలో కట్టుకున్న చీరలు.. వాటికి డిజైనర్ బ్లౌజులుకనిపించడంతో ఇది త్రేతాయుగమా లేక 2026 నాటి ఫ్యాషన్ షోనా? అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా, సీతాదేవిగా సాయి పల్లవి లుక్ విషయంలో కూడా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. భారీ బడ్జెట్‌తో కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినప్పటికీ, రామాయణ కావ్యం వెదజల్లే కల్చరల్ టెక్స్చర్, ఆధ్యాత్మికత లోపించాయని ఆరోపిస్తున్నారు. పురాతన పౌరాణిక కథను నేటితరం డెకోరమ్ పేరుతో ఆధునిక వెడ్డింగ్ డ్రెస్‌లా డిజైన్ చేయడం పట్ల నెటిజన్లు మేకర్స్‌పై మండిపడుతున్నారు. అవేమీ చీరలు.. ఇదెక్కడి రామాయణం.. సీత అలా ఉంటుందా.. ఏ బుక్ లో రాశారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో రణబీర్, యశ్ నటన కంటే ఈ ఫ్యాషన్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ మోడ్రన్ రామాయణ ప్రేక్షకులను మెప్పిస్తుందా.. ట్రోల్స్ కి గురవుతుందా అనేది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy