చిన్న చిత్రంగా థియేటర్లలోకి వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఊహించని పెద్ద విజయాన్ని సాధించిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి' (Raju weds Rambai).
పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో, సహజసిద్ధమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కథానాయిక తేజస్వి (Tejaswi). ఈ సినిమాలో తన నటనతో, అమాయకత్వంతో ఆకట్టుకున్న ఈ భామ, ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
ఇప్పటివరకు తను నటించిన సినిమాలలో ఎంతో పద్ధతిగా, లంగా ఓణీలు, చీరకట్టులోనే కనిపిస్తూ హోమ్లీ ఇమేజ్‌ను సంపాదించుకుంది తేజస్వి. ఎక్కడా కూడా గ్లామర్ ప్రదర్శనకు చోటు ఇవ్వకుండా తన పాత్రలకే పరిమితమైంది. అయితే తాజాగా ఈ అమ్మడు వెకేషన్‌కు వెళ్లగా, అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కారణం.. ఇప్పటివరకూ చూడని రేంజ్‌లో తేజస్వి ఇచ్చిన షాకింగ్ గ్లామర్ ట్రీటే! ట్రెండీ డిజైనర్ అవుట్‌ఫిట్స్‌లో బోల్డ్ అవతార్‌లో కనిపించి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకేసారి ఈ స్థాయిలో అందాల విందు వడ్డించడంతో నెటిజన్లు పిక్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. కామెంట్ సెక్షన్‌లో అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతూ.. 'మా రాంబాయి కూడా గ్లామర్ ఫీల్డ్‌లోకి దిగిందిగా!', 'హోమ్లీ లుక్ నుంచి ఒక్కసారిగా బోల్డ్ క్వీన్‌గా మారిపోయింది!' అంటూ కొంటెగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
'రామాయణ' డిజైన్ దుస్తుల కాంట్రవర్సీపై డిజైనర్స్ ఫైర్

