Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయన్ నేషనల్ అవార్డుపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్..

రాయన్ నేషనల్ అవార్డుపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్..

Chitrajyothy 3 weeks ago

మిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) దర్శకత్వంలో నటించిన రాయన్ (Raayan) చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం (National Film Award) దక్కడంపై కోలీవుడ్ మొత్తం తీవ్రంగా భగ్గుమన్న విషయం తెలిసిందే.

ఈ అవార్డు ఎంపిక ప్రక్రియ, దానికి సంబంధించిన వివాదంపై నటుడు ధనుష్ సైతం బహిరంగంగానే తన ఆవేదనను, అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఈ అవార్డుల ప్రకటనపై కొద్దిగా విమర్శలు వచ్చినప్పటికీ, తన అద్భుత చిత్రాలైన పుదుపేటై, వడ చెన్నై వంటివి గతంలో మిస్ అయినప్పుడు ఎవరూ స్పందించలేదని, ఇప్పుడు సత్యం సుందరం, మహారాజ సినిమాలకు అవార్డు రాలేదని అందరూ మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చాడు. దీంతో జాతీయ అవార్డుల పారదర్శకతపై తమిళ సినీ వర్గాల్లో ఇప్పటికీ తీవ్రమైన చర్చ నడుస్తోంది.

ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఈ నేషనల్ అవార్డు వివాదంపై సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) కూడా తనదైన శైలిలో స్పందించింది. అవార్డుల ఎంపిక ప్రక్రియపై తనకు కూడా పలు అనుమానాలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించింది. అసలు ఏ ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని సినిమాలకు జాతీయ అవార్డులు ఇస్తున్నారో అర్థం కావడం లేదని, కొన్నిసార్లు అవార్డులు పొందిన చిత్రాల కంటే ఒడియా వంటి చిన్న ప్రాంతీయ భాషా చిత్రాలే ఎంతో అద్భుతంగా ఉంటాయని ఆమె కుండబద్దలు కొట్టి చెప్పింది.

అంతటి నాణ్యమైన కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను పక్కనబెట్టి, కొన్ని రకాల చిత్రాలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆలోచన తనకు ఎప్పుడూ వస్తుంటుందని ఖుష్బూ చెప్పడం మళ్లీ కోలీవుడ్ లో కలకలం రేపింది. ధనుష్ ఆవేదన వ్యక్తం చేసిన వెంటనే ఖుష్బూ కూడా ఈ తరహాలో స్పందించడంతో ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత విపరీతంగా వైరల్ అవుతోంది. నేషనల్ అవార్డుల జ్యూరీ నిర్ణయాలపై సినీ విశ్లేషకులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఖుష్బూ వ్యాఖ్యలపై ధనుష్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy