కొన్ని సినిమాల కథలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ కోవకు చెందిందే 'టార్టాయిస్' మూవీ. రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా, అమృత చౌదరి (Amrutha Chowdary) హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
రిత్విక్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీని విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేశ్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, 'మా 'టార్టాయిస్' మూవీ చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ. రాజ్ తరుణ్ 25వ చిత్రంగా రాబోతోంది. అతని కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో మంచి థ్రిల్లర్ చిత్రం ఇది రూపుదిద్దుకుంటోంది' అని అన్నారు. ఎంచుకున్న పాయింట్ గురించి చెబుతూ, 'హీరో కి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో తను ఒక అమ్మాయిని చంపేస్తాడు. తర్వాత ఏమి జరుగుతుంది... అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో పూర్తి చేసుకుని ఆపైన విడుదల చేస్తాం' అని తెలిపారు.

