Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajendra Prasad: ఆ సినిమా వల్ల అరెకరం అమ్మేశాను.. దానికి నేను పనికిరాను

Rajendra Prasad: ఆ సినిమా వల్ల అరెకరం అమ్మేశాను.. దానికి నేను పనికిరాను

Chitrajyothy 3 weeks ago

టకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆయన పద్మశ్రీని కూడా అందుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారారు.

ఇన్నేళ్ల ఆయన కెరీర్ లో హీరోగా సక్సెస్ అయినా నిర్మాతగా మాత్రం ఫెయిల్ అయ్యారు. ఆయన నిర్మించిన రాంబంటు సినిమాతోనే ఆ విషయం తెలిసి వచ్చిందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో రాజేంద్రప్రసాద్.. తాను నిర్మాతగా ఫెయిల్ అయ్యినట్లు ఒప్పుకున్నారు.

బాపు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ నటించి, నిర్మించిన సినిమా రాంబంటు. 1995 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తాజాగా ఈ ఫెయిల్యూర్ గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. ' రాంబంటు సినిమాతో నేను నిర్మాతగా పనికిరాని అని తేలిపోయింది. ఆ సినిమా వల్ల నేను అన్నపూర్ణ స్టూడియోస్ పక్కన ఉన్న అరెకరం స్థలం అమ్మేశాను. నేను ఏరోజు డబ్బుల గురించి ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. నేను ఇవాళ్టికి కోట్లు తీసుకున్న హీరోని కాదు. ఏడాదికి 12 రిలీజ్ లు చేసే హీరోగా ఉన్నాను. అందులో ఎన్ని వందరోజులు ఆడియో మీకు అందరికీ తెలుసు. ఛాంబర్ లో లిస్ట్ కూడా ఉంటుంది.

నాకల్లా నా పనిచేసుకుంటూ పోవడమే తెలుసు. తీసుకోవడం, పోగేసుకోవడం తెలిసినవాడిన కాదు. నిజంగా చెప్తున్నాను.. నేను ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ అని నాకు తేలిపోయి .. మరీ ముఖ్యంగా రాంబంటు ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను.. నిర్మాత అనే పోస్టుకు నేను పనికిరాను అని తేల్చుకొని సినిమాలు తీయడం మానేశాను' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy