Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RAPO23: రామ్ కొత్త అవతారం.. సెట్ అవుతుందా

RAPO23: రామ్ కొత్త అవతారం.. సెట్ అవుతుందా

Chitrajyothy 1 week ago

నర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) డైరెక్టర్ గా మారబోతున్నాడు అంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక మే 15 న రామ్ పుట్టినరోజు సందర్బంగా ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

గత కొన్నేళ్లుగా రామ్ కి ఒక మంచి హిట్ పడింది లేదు. ఈ ఏడాది ఆంధ్రాకింగ్ తాలూకా అయినా రామ్ ని గట్టెక్కిస్తుంది అనుకున్నారు. కానీ, అది కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో విసిగిపోయిన రామ్.. తనకు తానే ఒక మంచి కథను రాసుకొని.. డైరెక్టర్ గా అవతారమెత్తాడు.

రాపో 23 గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రామ్ నే కథను అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాను రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నాడు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాపో23 తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వీరగా రామ్ కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం రామ్ చాలా కష్టపడినట్లు లుక్ చూస్తుంటే తెలుస్తుంది. ఫేస్ చూపించకపోయినా బ్యాక్ నుంచే చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాలు తెరకెక్కించడం కొత్తేమి కాదు. చాలామంది అలా సక్సెస్ కూడా అయ్యారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.. ప్రేక్షకులు వేరు. కంటెంట్ మీద ఆధారపడి సినిమాలు హిట్ అవుతున్న ఈ సమయంలో రామ్ మంచి కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను మెప్పించి, సక్సెస్ అవుతాడా.. ? లేక డైరెక్టర్ గా చేతులు కాల్చుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy