Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Salman Khan: ఒంటరితనం.. ఆ నోట్‌ నా గురించి కాదు.. సల్మాన్‌ క్లారిటీ..

Salman Khan: ఒంటరితనం.. ఆ నోట్‌ నా గురించి కాదు.. సల్మాన్‌ క్లారిటీ..

Chitrajyothy 5 days ago

తాను ఒంటరిగా ఉన్నానంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయిన సంగతి తెలిసిందే!

షర్ట్‌ లేకుండా ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసి ఒంటరితనం గురించి నోట్‌ రాశారు. అది క్షణాల్లో వైరల్‌ అయింది. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళనకు గురై, ఏమైందంటూ వరుస పోస్ట్‌లు పెట్టారు. దీనిపై సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. 'ఆ పోస్ట్‌ నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు. ఇంతమంది అభిమానులు, ఇంత పెద్ద కుటుంబం, స్నేహితులు ఉన్నప్పుడు ఎలా ఒంటరినవుతాను?

నేను నా గురించి మాట్లాడలేదు. మీ అందరి ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉంటే నేను ఒక్కడినే అనే భావన ఎందుకు వస్తుంది? మీరంతా నాతో ఉంటున్నా.. అలా అనుకుంటే నేను కృతజ్ఞత లేనివాడిని అవుతాను. నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించిందంతే. దాన్ని అభిమానులు, నెటిజన్లు హైలైట్‌ చేస్తూ వార్తలో నిలిచేలా చేశారు. మా అమ్మ కూడా నన్ను 'ఏమైంది నాన్న' అని అడుగుతోంది. ప్లీజ్‌.. రిలాక్స్‌ అవ్వండి ఫ్రెండ్స్‌' అని తన తాజా పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ 'మాతృభూమి' చిత్రంలో నటిస్తున్నారు. దీనితోపాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. దిల్‌ రాజు నిర్మాత.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy