Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సన్ రైజర్స్‌'కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

'సన్ రైజర్స్‌'కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Chitrajyothy 2 weeks ago

'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026' (IPL 2026).. ప్రస్తుతం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. టేబుల్‌లో టాప్ స్థానానికి ఎవరూ ఊహించని జట్లు చేరుకుంటే, అదే తరహాలో ఎన్నో అంచనాలున్న జట్లు లీస్ట్‌కి చేరాయి.

ముఖ్యంగా ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ జట్లు వరుస పరాజయాలతో.. ట్రోఫీపై ఆశలు వదిలేసుకున్నాయి. పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు టాప్ 4లో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక జట్టు ఈసారి ట్రోఫీ అందుకుంటుందనేలా ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఎప్పటిలానే ఐపీఎల్ మ్యాచ్‌లను తిలకించేందుకు వస్తోన్న సెలబ్రిటీల హాజరు కూడా గణనీయంగానే ఉంది. ఆదివారం, హైదరాబాద్‌లో జరిగిన సన్ రైజర్స్ మ్యాచ్‌కు సెలబ్రిటీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

అందులో పై ఫొటోలో ఉన్న నటి.. స్టేడియంలో హుషారుగా కనిపిస్తూ అందరి కంట పడింది. కెమెరాలు కూడా ఆమెను పదే పదే చూపించడంతో.. సోషల్ మీడియా అంతా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించినప్పటికీ, సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) జట్టు నిరాశ పరచలేదు. బౌండరీలతో ఫ్యాన్స్‌ని అలరించారు. అలా సన్ రైజర్స్ ఆటగాళ్లు బౌండరీలు కొట్టిన ప్రతిసారి, ఈ భామ ఆ జట్టు ఫ్లాగ్‌ను ఊపుతూ సందడి చేస్తూనే ఉన్నారు. దీంతో, ఎస్.ఆర్.హెచ్. వర్సెస్ కె.కె.ఆర్. మ్యాచ్‌లో హోమ్ టీమ్ హైదరాబాద్‌కి సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరా? అని అంతా సెర్చింగ్ మొదలెట్టారు.

ఇంతకీ ఈ నటి ఎవరనుకుంటున్నారా? సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో షేక్ చేసే దివి వడత్యా (Divi Vadthya). ఆమె ఇలా స్టేడియంలో నిలబడి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ భామ ఎవరో గుర్తు పట్టారా? అంటూ కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. ఆమె ఎవరో తెలిసిన వారు.. కామెంట్స్‌లో పేరు రివీల్ చేస్తున్నా, తెలియని వారంతా.. 'ఎవరో చెప్పండయ్యా?' అంటూ అడుగుతున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. దివి కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో స్టేడియంలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. దీంతో, ఈ భామ పేరు ట్రెండ్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy