Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం విజయ్.. ప్రధాని అవుతాడు! మోదీ.. జాతకానికి జీరాక్స్ కాపీ

సీఎం విజయ్.. ప్రధాని అవుతాడు! మోదీ.. జాతకానికి జీరాక్స్ కాపీ

Chitrajyothy 1 week ago

ప్రముఖ నటుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay)కు ప్రధాని అయ్యే యోగం ఉందంటూ ఓ జ్యోతిష్యుడు చెప్పిన జాతకం ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే ఇటీవల సీఎం పీఠం అధిరోహించిన విజయ్ జాతకంలో ప్రధాని అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు రాధన్ పండిట్ (Radhan Pandit) తెలిపారు.

ఇటీవల ప్రముఖ తమిళ మీడియా సంస్థ తంతి టీవీ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ జాతకానికి జీరాక్స్ కాపీలా విజయ్ జాతకం ఉందని ఇద్దరి గ్రహస్థితులు, ప్రజాధరణ వంటి అంశాలు దాదాపు ఒకేలా ఉన్నాయని ఆయన వివరించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. రానున్న 30 నుంచి 40 సంవత్సరాల పాటువిజయ్‌కు రాజకీయంగా పెద్ద పోటీ ఉండనే ఉండదని, పైగా ఆయన ప్రభావం నిత్యం పెరుగుతూ పోతుందని జోస్యం చెప్పారు. ఆయన నిరాడంబరత, నిజాయితీ, నిర్ణయాలు దేశ రాజకీయాల్లో కీలకం అవుతాయని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాకయ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఉబ్బి తబ్బిబవుతున్నారు. ప్యూచర్ ఫ్రైమ్ మినిస్టర్ విజయ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy