Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ

సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ

Chitrajyothy 0 months ago

సౌత్ ఇండియన్ ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha) ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. దళపతి విజయ్ సీఎం అయినదగ్గరనుంచి అటు తమిళ్, ఇటు తెలుగు ఇండస్ట్రీలు అమ్మడి గురించే చర్చించుకుంటున్నాయి.

ఆమె కనిపిస్తే విజయ్ తోనే కనిపించడంతో వీరిద్దరి రిలేషన్ ఎంతో తెలియక.. పెళ్లి చేసుకుంటారో లేదో అర్ధం కాక ఫ్యాన్స్ నలిగిపోతున్నారు. త్రిష ఏది చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోతోంది. తాజాగా ఈ చిన్నది.. సీనియర్ నటి ఖుష్బూ కుమార్తె వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసింది. తన రాయల్ అండ్ ట్రెడిషనల్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వేడుకలో అందరి దృష్టి త్రిష డైమండ్ నెక్లెస్ మీదనే ఉంది.

త్రిష సినిమాల్లో లుక్స్ గురించి పక్కన పెడితే.. బయట ఆమె వేడుకల్లో కనిపించే లుక్ చలా హుందాగా ఉంటుంది. మొదటి నుంచి అందరి కళ్లు తనవైపు తిప్పుకొనేలా చేయడం త్రిషకు వెన్నతో పెట్టిన విద్య. విజయ్ ప్రమాణస్వీకారం రోజున బ్లూ కలర్ చీరలో ఆమె అందాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు. ఇక ఇప్పుడు ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో త్రిషనే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ముఖ్యంగా త్రిష ధరించిన ఎమరాల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో మోస్ట్ ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్‌గా మారింది. సాంప్రదాయ బంగారు అంచు గల కసవు చీర.. దానిపై గ్రీన్ కలర్ హెవీ నెక్లెస్ కాంబినేషన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇక త్రిష ధరించిన ఈ లగ్జరీ నెక్లెస్ ధర తెలిసి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఈ లగ్జరీ పీస్ అత్యంత అరుదైన కొలంబియన్ లేదా జాంబియన్ ఎమరాల్డ్స్‌తో తయారైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు అద్భుతమైన పోల్కి డైమండ్స్ వాడటంతో ఈ నెక్లెస్‌కు మరింత రాయల్ లుక్ వచ్చింది. దీని విలువ సుమారు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ వేడుక కోసం ఆమె ఎంచుకున్న స్పెషల్ డిజైనర్ సారీ ఔట్‌ఫిట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ బ్రాండ్‌కు చెందిన ఈ ట్రెడిషనల్ వేర్ ధర సుమారు రూ. 1.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుందని టాక్ నడుస్తోంది. దీంతో త్రిష రేంజ్ ఎలాంటిదో అర్ధమవుతోంది. ప్రస్తుతం త్రిష ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్.. ఎంతైనా సీఎంకి కాబోయే భార్య కదా ఆ మాత్రం ఉంటుందిలే అని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం.. త్రిష నగల కలక్షన్ ఇప్పటిది కాదు.. పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఆమె ధరించిన అన్నీ నగలు.. ఆమె సొంతవే అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా త్రిష మాత్రం ఈ లుక్ లో అదరగొట్టేసింది అనేది మాత్రం నిజమని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy