Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టార్ హీరోతో భార్య ఎఫైర్.. పిల్లల కోసమే రవి మోహన్ దాచాడా

స్టార్ హీరోతో భార్య ఎఫైర్.. పిల్లల కోసమే రవి మోహన్ దాచాడా

Chitrajyothy 1 week ago

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (Ravi Mohan) ప్రెస్ మీట్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. వ్యక్తిగత విషయాల వలన తాను ఎంత సఫర్ అవుతున్నాడో ప్రెస్ మీట్ లో చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ముఖ్యంగా తన భార్య ఆర్తి (Aarthi) తనను వేధిస్తోందని, పిల్లలను దగ్గరకు రానివ్వడం లేదని చెప్పడంతో ఆమె గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. రవి మోహన్.. విడాకులు ఇవ్వకుండా సింగర్ కెనీషా తో రిలేషన్ లో ఉన్నాడని ఆమెను ఎంతో విమర్శించారు.

అయితే ఆర్తి కూడా ఒక స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రవి మోహన్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరోతో ఆర్తి ఎఫైర్ పెట్టుకుందని, ఈ విషయం అతనికి కూడా తెలుసని అంటున్నారు. కొన్నేళ్ళ క్రితమే ఆ హీరోతో ఆర్తి రవి మోహన్ కి కనిపించిందని, ఆ విషయం బయటకు చెప్తే పిల్లల భవిష్యత్ పాడవుతోందని, తల్లి ప్రేమకు వారు దూరమవుతారని భావించి రవి మోహన్ ఈ విషయాన్ని బయటపెట్టలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ విషయం బయటకు రావడంతో ఆ స్టార్ హీరో ఎవరు అని నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆ హీరో ధనుష్ అని టాక్ నడుస్తోంది. ధనుష్, ఆర్తి మధ్య ఏదో జరిగిందని, ఆ విషయం రవి మోహన్ కి తెలియడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకొస్తున్నారు. రవి - ఆర్తి విడాకులకు ధనుష్ కూడా కారణమని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy