ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) అనే బాలల చిత్రం రాబోతోంది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఫేమ్ బేబి ఖుషి (Baby kushi) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఖుషి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఖుషి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూతురి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఇందులో ఆ చిన్నారి కీలక పాత్రతో మెప్పించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

