Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్య, కార్తీ.. పదే పదే అవే తప్పులు!

సూర్య, కార్తీ.. పదే పదే అవే తప్పులు!

Chitrajyothy 1 week ago

మిళ స్టార్ హీరోలు సూర్య (Suriya), కార్తీ (Karthi) అన్నదమ్ములుగా మాత్రమే కాదు, తమ కెరీర్ నిర్ణయాల్లో కూడా చాలా వరకు ఒకే దారిలో నడుస్తున్నట్లు అర్థమవుతోంది.

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇటీవల వారి సినిమాలకు ఎదురైన సమస్యలే ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నాయి.

గతేడాది కార్తీ నటించిన 'వా వాత్తియార్' (Vaa Vaathiyaar) ( తెలుగులో అన్నగారు వస్తారు) చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా విడుదల చాలాకాలం వాయిదా పడింది. అంతకుముందు జపాన్ సినిమా సైతం ఇలాంటి చిక్కుల్లోనే పడింది. ఇదే సమయంలో తాజాగా సూర్య నటించిన 'కరుప్పు' (Karuppu) కూడా ఇలాంటి కారణాల వల్ల అనుకున్న సమయానికి విడుదల కాక సమస్యల్లో చిక్కుకుపోయింది. ఈ రెండు సినిమాల వెనుక ఉన్న నిర్మాణ సంస్థలు తరుచూ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఎదురవుతునే ఉన్నాయి. అయినా ఈ ఇద్దరు హీరోలు మాత్రం అవి ఆలోచించకుండానే సినిమాలు చేస్తు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక.. ప్రత్యేకంగా 'కరుప్పు' విడుదలలో ఎదురైన అడ్డంకులను తొలగించేందుకు సూర్య స్వయంగా జోక్యం చేసుకున్నారని కోలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ సినిమా విడుదలకు ఆటంకం కలగకుండా ఆయన నిర్మాతలకు అండగా నిలిచినట్లు సమాచారం. మరోవైపు, కార్తీ ప్రస్తుతం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) నిర్మిస్తున్న 'మార్షల్' (Marshal) చిత్రంలో నటిస్తున్నారు. గతంలో కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమైనప్పటికీ, అదే బ్యానర్‌తో ఆయన మరోసారి పని చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆర్థిక సమస్యలు సినిమాల విడుదలలను ప్రభావితం చేస్తున్నా, నిర్మాతలతో ఉన్న నమ్మకాన్ని సూర్య, కార్తీ వదులుకోవడం లేదనిపిస్తోంది. కమర్షియల్ లెక్కల కంటే సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు సినీ విశ్లేషకులు మాత్రం "ఇలాంటి నిర్ణయాలు కెరీర్ ప్లానింగ్‌పై ప్రభావం చూపవచ్చు" అని అభిప్రాయ పడుతున్నారు. వరుస ఆలస్యాలు అభిమానుల్లో నిరాశ కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. సూర్య, కార్తీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భవిష్యత్తులో వారి సినిమాల విడుదలలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy