Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్య సేవలకు సెల్యూట్..  8వేలకు పైగా విద్యార్థులకు కొత్త జీవితం

సూర్య సేవలకు సెల్యూట్.. 8వేలకు పైగా విద్యార్థులకు కొత్త జీవితం

Chitrajyothy 1 week ago

రీల్ హీరోలందరూ రియల్ హీరోలు కాలేరు. కొందరు పేరు కోసం సినిమాలు చేస్తే మరికొందరు సంపాదన కోసం నటిస్తుంటారు. కానీ ఆహీరో మాత్రం.. రిల్ పైనే కాదు రియల్ హీరో అని కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు.

అన్నిదానాల్లోకెల్లా గొప్పదానమైన విద్యాదానాన్ని పంచుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు

సినిమా హీరోలు అంటే తెరపై ఫైట్లు, డ్యాన్సులు చేసేవాళ్లు మాత్రమే కాదు.. కొందరు నిజ జీవితంలో ఎందరికో దారి చూపించే వెలుగుగా కూడా మారుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యాక్టర్ సోనూ సూద్ లాంటి వాళ్లు ఆపదలో ఉన్నవాళ్లకు ఆర్థిక సాయం చేయడం, వైద్యం అందించడం, ఉద్యోగాలు ఇప్పించడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.అన్నదానం, ఆర్థిక సహాయం చేసే సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. కానీ విద్యాదానంతో వందల కుటుంబాల తలరాతలు మార్చిన హీరో అరుదు. ఆ అరుదైన హీరో పేరు సూర్య (Suriya).

సూర్య కోలీవుడ్ స్టార్ అయినా తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. వరుస సినిమాలు చేస్తున్నా పేద విద్యార్థులకు అండగా ఉంటున్నారు. 2006లో అగరం ఫౌండేషన్ (Agaram Foundation) మొదలుపెట్టి పేద విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మొదటి తరం గ్రాడ్యుయేట్ అవ్వాలని కలలు కనే పిల్లలకు ఆర్థిక అడ్డంకి లేకుండా చేశాడు.'విధై' కార్యక్రమం ద్వారా కేవలం ఫీజులు కట్టడమే కాదు, మెంటరింగ్, గైడెన్స్, వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

అగరం సంస్థతో 2025 నాటికి 8వేల మందికి పైగా విద్యార్థుల జీవితాలు మారాయి. అందులో 6,700 మంది వాళ్ల కుటుంబాల్లో మొదటి గ్రాడ్యుయేట్లు. దళిత, గిరిజన, శ్రీలంక శరణార్థి విద్యార్థులకు కూడా అండగా నిలిచింది అగరం. ఈ ఫౌండేషన్ చలవతోనే ఇప్పటివరకు 51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లు సమాజంలోకి వచ్చారు. స్టార్‌డమ్ అంటే స్క్రీన్ మీద కనిపించడం కాదు, ఇలా బతుకులు మార్చడమే అని సూర్య నిరూపించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy