సహచర నటుడు, టీవీకే ఆధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ (Vijay) తో అగ్ర నటుడు, ఎంఎన్ఎం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ (Kamal Haasan) శనివారం కలుసుకుని అభినందనలు తెలిపారు.
నగర శివారు ప్రాంతం నీలాంకరైలో ఉన్న విజయ్ నివాసానికి వెళ్ళిన కమల్ హాసన్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విషయంపై కమల్ హాసన్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపాను. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక విషయాలను ఈ సందర్భంగా ఆయన నాతో పంచుకున్నారు.
ఈ భేటీలో తమ్ముడు విజయ్ చూపిన ప్రేమాభిమానాలు మనస్సును ఎంతగానో హత్తుకున్నాయి. అదే సమయంలో తమిళ చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా సీఎం విజయ్ దృష్టికి తీసు కెళుతూ ఆరు ముఖ్యమైన అభ్యర్థనలు చేశారు. ఈ కృషి ఫలవంతం కావాలని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు.

