Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
The Paradise: పోటీ ఉంది..కానీ దేనికదే ప్రత్యేకం

The Paradise: పోటీ ఉంది..కానీ దేనికదే ప్రత్యేకం

Chitrajyothy 3 days ago

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. ఒకరు క్లాస్, మాస్ అనే తేడా లేకుండా నటనతో మెప్పించే నాచురల్ స్టార్ నాని, మరొకరు తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న మలయాళీ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌.

ఆగష్టు నెలలో వీరిద్దరి మధ్య గట్టి పోటీ జరగబోతోంది. ఒకే వారంలో ఇద్దరు క్రేజీ హీరోలు థియేటర్లలోకి వస్తుండటంతో సినిమా లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది.

ముందుగా నాచురల్ స్టార్ నాని సినిమా విషయానికి వస్తే.. దసరా లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చి 26వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కాకపోతే, షూటింగ్ కాస్త ఆలస్యం కావడం, ఆ పైన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. దాంతో ఈ సినిమా ఆగష్టు 21న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే మధ్యలో ఈ డేట్‌కు కూడా రావడం కష్టమే అనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ది ప్యారడైజ్ టీమ్ ఆగష్టు 21 ఫిక్స్ అని క్లారిటీ ఇచ్చేసింది. ఆ తేదీన నాని సినిమాకు ఎలాంటి పోటీ లేదనుకుంటున్న తరుణంలో బాక్సాఫీస్ రేసులోకి దుల్కర్‌ సల్మాన్‌ ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్‌లో దుల్కర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌ సినిమాల ఘనవిజయం తర్వాత ఇక్కడ ఆయన మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఐయామ్ గేమ్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాని ది 'ప్యారడైజ్' రిలీజ్ కావడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే ఆగష్టు 20న ఐయామ్ గేమ్ సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాల కంటెంట్ విషయానికి వస్తే.. దేనికదే చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ది ప్యారడైజ్ చిత్రం పక్కా రా అండ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. శ్రీకాంత్ ఓదెల మార్క్ మేకింగ్ ఇందులో మరో స్థాయిలో ఉండబోతోందని టాక్. మరోవైపు దుల్కర్ నటిస్తున్న ఐయామ్ గేమ్ పక్కా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. గతంలో ఆర్డీఎక్స్ లాంటి సూపర్ హిట్ యాక్షన్ చిత్రాన్ని అందించిన దర్శకుడు నహాస్ హిదాయత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకంతో దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ అయిన వేఫారర్ ఫిల్మ్స్ పైనే భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. ఒకటి శ్రీకాంత్ ఓదెల మార్క్ మాస్ యాక్షన్.. ఇంకొకటి నహాస్ హిదాయత్ మార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు భారీ చిత్రాలు తలపడబోతుండటంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. కంటెంట్ పరంగా ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది, బాక్సాఫీస్ రేసులో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy