Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిలక్ వర్మతో రిలేషన్.. శ్రీలీల టీమ్ స్పందనిదే!

తిలక్ వర్మతో రిలేషన్.. శ్రీలీల టీమ్ స్పందనిదే!

Chitrajyothy 6 days ago

డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela), ఇండియన్ క్రికెటర్ - తెలుగబ్బాయ్ తిలక్ వర్మ (Tilak Varma) మధ్య రిలేషన్ నడుస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ ఆ మధ్య తిరుమల శ్రీవారిని సందర్శించడం, ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలీల కనిపించడం వంటి విషయాలతో, నిజంగానే ఇద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందనేలా టాక్ మొదలైంది. మరీ ముఖ్యంగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే టాపిక్ హైలెట్ అవుతూ వస్తోంది. శ్రీలీల, తిలక్ వర్మ మధ్య రిలేషన్ నిజమేనా? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు తిలక్ భలే ఛాన్స్ కొట్టేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై శ్రీలీల టీమ్ రియాక్ట్ అవుతూ.. వినిపిస్తున్న వార్తలలో నిజం లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు వచ్చిన ప్రకటనలో.. నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మల మధ్య ఏదో ఉందంటూ వస్తున్న రూమర్లు పూర్తిగా అవాస్తవమని అధికారికంగా టీమ్ తెలిపింది. ''తిలక్ వర్మ, శ్రీలీల విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ ముమ్మాటికీ బేస్‌లెస్, అందులో అసలు వాస్తవం లేదు. వీరిద్దరూ ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఈ ఊహాగానాలలో ఎంతమాత్రం నిజం లేదు, ఎలాంటి వాస్తవిక ఆధారం లేకుండా.. దయచేసి ఇలాంటి కల్పిత కథనాలను ప్రచారం చేయవద్దు'' అని టీమ్ స్పష్టం చేసింది.

అలాగే మీడియాను కూడా టీమ్ రిక్వెస్ట్ చేసింది. ఇలాంటి వ్యక్తిగత విషయాలపై వార్తలు రాసే సమయంలో మీడియా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. ధృవీకరించని సమాచారాన్ని, రూమర్స్‌ను వ్యాప్తి చేయకుండా ఉండాలని టీమ్ కోరింది. మరోవైపు శ్రీలీల మదర్ స్వర్ణలత కూడా ఈ వార్తలను ఖండించినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతం శ్రీలీల చదువు, నటనతో బిజీగా ఉందని క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. శ్రీలీల తన వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉందని ఆమె స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ విషయంలో కూడా శ్రీలీలపై ఇలాంటి వార్తలే వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా స్వర్ణలత ఇలానే ఆ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy