Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!

తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!

Chitrajyothy 2 months ago

మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం ఏవేవో చేస్తున్నారు. ఏది నిజమో, ఏది కల్పితమో కూడా అర్థం కాని విధంగా చేస్తున్న ప్రమోషన్స్, కొంత మేరకు సినిమాకు యూజ్ కూడా అవుతున్నాయనుకోండి.

అది వేరే విషయం. ఇప్పుడలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదీ కూడా క్యాస్ట్‌కు సంబంధించి ఉండటం విశేషం. బుల్లితెర కమల్ హాసన్‌గా పేరున్న గెటప్ శ్రీను (Getup Srinu), తాజాగా జర్నలిస్ట్ జాఫర్‌ (Jaffar)కు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్‌ పరిచయాలతో సరదాగానే ప్రారంభమైంది.. ఆ తర్వాతే.. 'తొక్కలో ఇంటర్వ్యూ' అంటూ మధ్యలోనే కుర్చీ విసిరేసి వెళ్లిపోయే వరకు చేరింది. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే అని క్లియర్‌గా అర్థమవుతుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం.

అసలు విషయం ఏమిటంటే.. మహదేవపట్నంలో గెటప్ శ్రీనును జాఫర్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. మొదట జాఫర్ మంచి హిట్ కొట్టినట్లు ఉన్నారని అడగగా.. ఏదో దేవుడి దయ అంటూ గెటప్ శ్రీను సమాధానమిచ్చారు. 'రాకాస' సక్సెస్ తర్వాత మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లుగా గెటప్ శ్రీను చెప్పారు. ఆ వెబ్ సిరీస్ టైటిల్ చెప్పగానే.. కచ్చితంగా ఇందులో నటించాలని ఫిక్స్ అయ్యానని గెటప్ శ్రీను అనగానే.. 'ఏంటా టైటిల్' అంటూ జాఫర్ అడిగారు. 'మేము కాపులం' అని అనగానే జాఫర్ ఫేస్ ఒక్కసారిగా మాడిపోయింది. ఆ టైటిల్ నాకు నచ్చలేదు.. అంటూ డైరెక్ట్‌గా చెప్పేయడంతో శ్రీనుకు కోపం వచ్చింది.

మీ సిరీస్ కోసం కులాన్ని వాడుకుంటారా? లేదంటే కావాలని కాంట్రవర్సీ చేస్తారా? అంటూ జాఫర్ అడుగుతుండగానే.. 'తొక్కలో ఇంటర్వ్యూ' అంటూ అసహనం వ్యక్తం చేస్తూ.. కుర్చీ విసిరికొట్టి గెటప్ శ్రీను వెళ్లిపోయారు. దీంతో, 'ఇప్పుడు నేనేం అడిగాను.. నేను ఏమైనా తప్పుగా అడిగానా? ఎందుకు మీరు అంత సీరియస్ అవుతున్నారు?' అంటూ జాఫర్ తనలో తానే ప్రశ్నించుకుంటున్నారు. గెటప్ శ్రీను మాములుగా అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. కావాలని, ఈ ఇంటర్వ్యూ చేసినట్లుగా అయితే అర్థమవుతోంది. మరి ఈ ఇంటర్వ్యూపై, ఇద్దరి మధ్య చెలరేగిన ఈ విభేదానికి.. ఫైనల్‌గా ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

'ఇద్దరి నుంచి ముగ్గురుగా'.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!

ప్రేమలో పూజా హెగ్డే.. కుర్రాడు కత్తిలా ఉన్నాడుగా!

'భోగి'లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy