Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trisha Krishnan: సీఎం త్రిష.. పదేళ్ళ క్రితమే ప్లాన్

Trisha Krishnan: సీఎం త్రిష.. పదేళ్ళ క్రితమే ప్లాన్

Chitrajyothy 3 weeks ago

Trisha Krishnan: ఎవరైనా ఏదైనా బలంగా కోరుకుంటే.. దేవుడు ఖచ్చితంగా ఆ కోరికను నెరవేరుస్తాడని అంటారు. అందాల భామ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)విషయంలో అది నిజంగా జరిగిందనిపిస్తోంది.

చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని ప్రారంభించిన త్రిష తెలుగులో వర్షం సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని టాప్ స్టార్స్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. పెద్ద, చిన్న అనే తేడాలేకుండా అందరి హీరోలతో ఆమె రొమాన్స్ చేసింది.

సాధారణంగా ఒక హీరోయిన్ వద్దకు వెళ్ళి.. మరో పదేళ్ళలో మీరు ఏమవుతారు.. ? అంటే మహా అయితే పెళ్ళి చేసుకొని సెటిల్ అవుతాను అని, లేక హీరోయిన్ గానే కొనసాగుతాను అని.. అది కూడా లేకుండా బిజినెస్ విమెన్ గా మారతాను అని సమాధానం వస్తుంది. కానీ, త్రిష మాత్రం పదేళ్ళ క్రితమే తాను సీఎం అవుతానని కాన్ఫిడెంట్ గా చెప్పేసింది. ఆ కాన్ఫిడెంట్ తోనే త్రిష రాజకీయాలపై అడుగులు వేసింది.

నేడు విజయ్ విజయం వెనుక ఉన్న వారిలో త్రిష ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని తమిళ తంబీలు చెప్పుకొస్తున్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ వెంట ఒక నీడలా తిరిగింది. తాజాగా విజయ్ ఎన్నికల బరిలో కొత్త రికార్డ్ సృష్టించాడు. దీంతో ఖచ్చితంగా త్రిషను విజయ్ సీఎం చేస్తాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదేళ్ళ క్రితం త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రిష మాట్లాడుతూ.. ' నేను CM అవుతాను, ఇప్పుడు కాకపోయినా పదేళ్లకైనా తప్పకుండా CM అవుతాను' అని చెప్పింది. ఇప్పుడు ఆ మాట నిజం అయ్యేసరికి.. ఆమె ప్లాన్ కి ఫ్యాన్స్ కి ఫిదా అవుతున్నారు. అప్పుడు చెప్పింది.. ఇప్పుడు చేసింది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy