Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVK : విజయ్ సక్సెస్‌లో తమన్‌కు వాటా!

TVK : విజయ్ సక్సెస్‌లో తమన్‌కు వాటా!

Chitrajyothy 2 weeks ago

ళపతి విజయ్ హీరోగా రూపొందిన తమిళ, తెలుగు చిత్రం 'వారసుడు'కు తమన్ స్వరకల్పన చేశారు. ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదలయింది. విజయ్ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చడం అదే మొదటిసారి.

ఆ తరువాత కూడా వారిద్దరి కాంబోలో ఏ చిత్రమూ రాలేదు. అయితే విజయ్ హీరోగా 'వారసుడు' తమిళంలో 'వారిసు' పేరిట విడుదలై అక్కడ మంచి విజయం సాధించింది. అందులోని పాటలు జనాన్ని విశేషంగా అలరించాయి. విజయ్ 2024 ఫిబ్రవరి 2న 'తమిళగ వెట్రి కళగమ్' పార్టీని నెలకొల్పారు. తరువాత రెండేళ్ళకు అంటే 2026లో తమిళనాట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీకి సై అంటున్నారని తెలిసి పలువురు సినీజనం పలు విధాల కామెంట్స్ చేశారు. అయితే తమన్ మాత్రం విజయ్ కి జనాల్లో ఉన్న క్రేజ్ కు తగ్గ బాణీలను సమకూర్చారు. ఆ పాటలే విజయ్ 'టీవీకే' పార్టీ ప్రచారంలో విశేషంగా పాలు పంచుకున్నాయి.

'టీవీకే' విజయగీతాలు...

విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగమ్' పార్టీ కోసం తమన్ మూడు పాటలకు బాణీలు కట్టారట... ఆ ట్యూన్స్ కు తమిళ గీత రచయిత వివేక్ పాటలు రాశారు. ఇందులో 'టీవీకే ఫ్లాగ్ ఆంథెమ్' పాటను 2024 ఆగస్టులో విడుదల చేశారు. ఈ పాటను దీపక్ బ్లూ గానం చేశారు. తరువాత 'టీవీకే పార్టీ'కి విజిల్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దాంతో 'టీవీకే విజిల్ ఆంథెమ్'ను కూడా తమన్ కంపోజ్ చేశారు. అలాగే "ఐ యామ్ యువర్ విజయ్. ఐ యామ్ కమింగ్..." సాంగ్ కూడా సరిగా ఎన్నికల సమయంలో విశేషాదరణ చూరగొంది. ఈ పాటలు వినగానే యూత్ పులకించిపోయేవారు. అదే తీరున విజయ్ పార్టీని గెలిపించారు. విజయ్ 'టీవీకే' పార్టీ విజయంలో తమన్ బాణీల్లో రూపొందిన పాటలకూ స్థానం ఉందని పరిశీలకులు అంటున్నారు.

విజయ్ ప్రచారంలో తమన్ స్వరకల్పనలో రూపొందిన పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. టీవీకే పార్టీ మీటింగ్స్ లో ముందుగా ఈ పాటలనే వినిపించేవారు. తరువాతే విజయ్ స్పీచ్ ఉండేది. అలా 'జెన్ జీ'ని ఈ పాటలు విశేషంగా అలరించాయి. యువత ఓట్లతోనే విజయ్ పార్టీ 'టీవీకే' ఘనవిజయం సాధించింది. విజయ్ 'వారసుడు'కు మాత్రమే తమన్ సంగీతం సమకూర్చినా, ఆయన పార్టీ 'టీవీకే' పాటలను కూడా స్వరపరచి ఓ స్పెషల్ గా నిలిచారు. మునుముందు తమన్ బాణీలను విజయ్ ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy