ప్రముఖ యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ (Sau abhayankar) రూపొందించిన ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్ 'రధిమా'ను థింక్ మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.
ఆధునిక పాప్ సంగీతం, ఖవ్వాలీ కలయికతో రూపొందిన ఈ పాట సరికొత్త సంగీత అనుభూతిని అందిస్తోంది. ఇందులో సాయి అభయంకర్‌తో కలిసి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ బోర్సే నృత్యం చేశారు. ప్రేమ విఫలమవడం అనే విషాద గాథగా కాకుండా.. యవ్వన ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా, సానుకూల భావనతో ఈ పాటను తెరకెక్కించారు.
తేజో భరద్వాజ్ దర్శకత్వం వహించిన 'రధిమా' ఆవిష్కరణ వేడుక చెన్నైలోని రాజలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. తనదైన ప్రత్యేక సంగీత స్వరాల కూర్పుతో ఇప్పటికే పలు హిట్ సాంగ్స్‌ను అందించిన సాయి అభయంకర్.. 'రధిమా' పాటను కూడా వినసొంపుగా స్వరపరిచారు. పాప్ సంగీతానికి ఖవ్వాలీ టచ్ జోడించి యువతను ఆకట్టుకునేలా ఈ పాటను రూపొందించారు. అలాగే పాటలో సాయి అభయంకర్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.

